PadmaShri Thimmakka Blessing MP Santosh Kumar: పద్మశ్రీ సాలుమారద తిమ్మక్క. వయసు 110 ఏళ్లు. కర్ణాటకకు చెందిన ప్రకృతి పరిరక్షకురాలు. ప్రముఖ పర్యావరణ వేత్త. మొక్కలే తన ప్రపంచంగా బతుకుతున్న మహానుభావురాలు. 25 ఏళ్ల వరకు పిల్లలు కలగకపోవడంతో... మొక్కల్నే తన పిల్లలుగా భావించారు. మొక్కల్ని పెంచుతూ పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్నారు . అందుకే యావద్దేశం ఆమెను వృక్షమాత అని కీర్తిస్తోంది. 110 ఏళ్ల వయసులోనూ ఎంతో యాక్టివ్‌గా ఉండే తిమ్మక్క... పద్మశ్రీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో నడుస్తూ వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ను ఆశీర్వదించి మరీ అవార్డును అందుకున్నారు. 2016 లో బీబీసీ విడుదల చేసిన అత్యంత ప్రభావవంతమైన వందమంది వ్యక్తుల జాబితాలో తిమ్మక్కకు స్థానంకూడా దక్కింది.
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం పద్మశ్రీ తిమ్మక్కను ఎంతో ఆకర్షించింది. ఎంపీ సంతోష్ చేస్తున్న ప్రకృతి సేవకు తరించి ఆయన్ను ఆశీర్వదించడానికి హైదరాబాద్ వచ్చారు తిమ్మక్క. ఈ సందర్భంగా ప్రగతిభవన్ లో ఆమెను ఘనంగా సన్మానించారు సీఎం కేసీఆర్. ఆమెను పల్లె,పట్టణ ప్రగతి సమీక్ష సమావేశానికి తీసుకొని వెళ్లి అందరికీ పరిచయం చేశారు. మొక్కలు నాటుతూ భవిష్యత్ తరాలను బతికించే బాధ్యతకోసం తన జీవితాన్నే అంకితం చేసిన తిమ్మక్కను మించిన దేశభక్తురాలు ఎవరూ లేరన్నారు. ఆమె మరింత కాలం ఆయురారోగ్యాలతో ఉండాలని సీఎం ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం ఎంతో గొప్పకార్యక్రమమని కితాబిచ్చారు పద్మశ్రీ తిమ్మక్క. స్వయంగా ప్రభుత్వమే మొక్కలు నాటే బాధ్యత తీసుకోవడం ఎంతో మంచి ఆలోచన అన్నారు. హరితహారం కోసం తాను పెంచిన పండ్ల మొక్కలను పంపిస్తానని తెలిపారు. తిమ్మక్క నిస్వార్థత సీఎం కేసీఆర్ ను ముగ్ధున్ని చేసింది. మంచి వారికి మంచి జరుగుతుందనేందుకు తిమ్మక్కే నిలువెత్తు నిదర్శనమని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.
అనంతరం గ్రీన్ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త ఎంపీ సంతోష్‌కుమార్ ను మనసారా ఆశీర్వదించారు తిమ్మక్క. తన వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఎంపీని ప్రశంసించారు. అప్పట్లో తాను, తన భర్త మాత్రమే మొక్కలు నాటేవారమని.. ఇప్పట్లాగా సౌకర్యాలు లేక ఊరుకూడా దాటి వెళ్లకపోయేవారమని తిమ్మక్క గుర్తుచేసుకున్నారు. ఈ కాలంలో డబ్బుతో పాటు అన్ని సౌకర్యాలున్నా ప్రకృతిపై మనిషికి ప్రేమ తగ్గిపోతోందని ఆవేదనవ్యక్తంచేశారు. అయినా ఎక్కడో ఓ చోట చెట్లంటే ప్రేమున్నవాళ్లు కనిపిస్తూనే ఉంటారని తెలిపారు. అందుకు ఎంపీ సంతోష్‌కుమారే నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో ఎంపీ సంతోష్చేస్తున్న వృక్షసేవ ఇన్ని కోట్ల మందికి చేరడం అద్భుతమని కొనియాడారు. అనుభవించేందుకు అన్ని సౌకర్యాలున్నా చెట్లంటే ఎంపీ సంతోష్‌కుమార్‌కు ఉన్న ప్రేమ తన హృదయాన్ని తాకిందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ మహాయజ్ఞాన్ని ఆపొద్దని సంతోష్‌కుమార్ తో మాట తీసుకున్నట్లు తెలిపారు. తన 111వ పుట్టినరోజు జూన్ 28 న తిమ్మక్క గ్రీన్ ఫౌండేషన్ ద్వారా ఇస్తున్న అవార్డును ఈ ఏడాది సంతోష్‌కుమార్ కు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ప్రగతిభవన్ లో ఎంపీ సంతోష్‌తో కలిసి మొక్కను నాటారు తిమ్మక్క. హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌పై సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరీ గౌరీశంకర్ సంపాదకత్వంలో వచ్చిన వ్యాసాల సంకలనం.. ‘ఆకుపచ్చని వీలునామా’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ఇండియా ఛాలెంజ్ బాధ్యులు రాఘవేంద్రతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
also read: Funny Viral Video: పెళ్లిపందిరిలో కోపంతో పెళ్లి కుమార్తె ఎంత పని చేసిందో చూడండి!
also read: F3 Ticket Price: సినీ అభిమానులకు శుభవార్త.. ఎఫ్ 3 టికెట్స్ రేట్స్ యథాతథం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.