TSRTC City Bus: ఆర్టీసీ గుడ్ న్యూస్... హైదరాబాద్‌లో ఇక అర్ధరాత్రి తర్వాత కూడా సిటీ బస్సులు...

Hyderabad City Bus: నగరంలో సిటీ బస్సుల్లో ప్రయాణించేవారికి గుడ్ న్యూస్. ఇకపై ఆర్టీసీ సిటీ బస్సు సర్వీసులు అర్ధరాత్రి తర్వాత కూడా అందుబాటులో ఉండనున్నాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 14, 2022, 08:20 AM IST
  • ఆర్టీసీ సిటీ బస్సు ప్రయాణికులకు గుడ్ న్యూస్
  • ఇకపై అర్ధరాత్రి తర్వాత కూడా అందుబాటులో సర్వీసులు
  • రద్దీ మార్గాల్లో నడవనున్న నైట్ సర్వీసులు
TSRTC City Bus: ఆర్టీసీ గుడ్ న్యూస్... హైదరాబాద్‌లో ఇక అర్ధరాత్రి తర్వాత కూడా సిటీ బస్సులు...

Hyderabad City Bus: హైదరాబాద్‌లో ఇకపై ఆర్టీసీ సిటీ బస్సుల సర్వీసులు 24 గంటల పాటు అందుబాటులో ఉండనున్నాయి. సాధారణంగా అర్దరాత్రి 12 గంటలకు చాలా మార్గాల్లో సిటీ సర్వీసులు నిలిచిపోతాయి. ఆ సమయం తర్వాత ప్రయాణం చేయాలంటే ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిందే. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో అర్ధరాత్రి 12 గంటల తర్వాత కూడా సిటీ బస్సులు నడపాలని ఆర్టీసి నిర్ణయించింది. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఈ సర్వీసులు నడుస్తాయి. ఆ తర్వాత ఎలాగూ రెగ్యులర్ బస్సులు డిపోల నుంచి బయలుదేరుతాయి. తాజా నిర్ణయంతో 24 గంటల పాటు ఆర్టీసీ సిటీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్లయింది.

ఇప్పటికే పలు మార్గాల్లో అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఆర్టీసీ సిటీ బస్సులను ప్రయోగాత్మకంగా నడుపుతున్నారు. ఈ సర్వీసులకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. క్రమంగా మరిన్ని మార్గాల్లోనూ నైట్ బస్సులను నడుపుతామని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. 

ఆర్టీసీ నైట్ బస్ సర్వీసుల్లోనూ అన్ని రకాల పాసులను అనుమతిస్తారు. ట్రావెల్ యాజ్ యు లైక్ టికెట్లను కూడా అనుమతిస్తారు. ఈ సర్వీసుల పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం అభద్రతకు గురిచేస్తుందని... ఆర్టీసీ బస్సుల్లో అయితే సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవచ్చునని అభిప్రాయపడుతున్నారు.

నైట్ బస్ సర్వీసుల వివరాలు :

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిత్యం ఎంత రద్దీగా ఉంటుందో తెలిసిందే. నిత్యం వందలాది రైళ్ల రాకపోకలు సాగుతుంటాయి. వీటిల్లో అర్ధరాత్రి లేదా తెల్లవారుజాము సమయంలో స్టేషన్‌కు చేరే... లేదా ఆ సమయంలో స్టేషన్ నుంచి బయలుదేరే రైళ్లు చాలానే ఉన్నాయి. 

ఆ సమయంలో స్టేషన్‌కు చేరుకోవాలనుకునే ప్రయాణికులకు లేదా స్టేషన్ నుంచి నగరంలో తాము ఉండే ప్రాంతాలకు చేరుకోవాలనుకునేవారికి ఆర్టీసీ సిటీ బస్సులు అందుబాటులో ఉండట్లేదు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని... ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు నైట్ సర్వీసులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి హయత్ నగర్, పటాన్ చెరు, బోరబండ, మెహదీపట్నం, అఫ్జల్ గంజ్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలకు నైట్ సర్వీసులు నడుపుతున్నారు. ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి కూడా పలు ప్రాంతాలకు ఆర్టీసీ నైట్ బస్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.

Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్... భారీగా తగ్గిన బంగారం ధరలు...  

Also Read: Also Read: Horoscope Today May 14 2022: రాశి ఫలాలు.. ఇవాళ ఆ రాశి వారి ఇంటికి అనుకోని అతిథి రావొచ్చు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News