KA Paul Meets Amit Shah: కేఏ పాల్ గురువారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కెఎ పాల్.. తమ భేటీలో చర్చకొచ్చిన అంశాలను మీడియాతో పంచుకున్నారు. తెలంగాణలో అవినీతి పెరిగిపోయిందని హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసిన విషయాన్ని తెలిపారు. ఇటీవల తెలంగాణలో తనపై జరిగిన దాడి గురించి హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. తన ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర మంత్రి.. మరో రెండు రోజుల్లో తాను హైదరాబాద్ వస్తున్నానని, అప్పుడు చర్యలు తీసుకునేలా చూసుకుంటానని హామీ ఇచ్చారన్నారు. కేవలం దాడి గురించి మాట్లాడటానికే ఇక్కడికి రాలేదని.. ఇంకా మరెన్నో అంశాలను చర్చించడానికి వచ్చానని అన్నారు.
కేసీఆర్.. కేటీఆర్.. తండ్రీకొడుకులిద్దరూ నాపైనే దాడి చేయిస్తారా అంటూ వార్నింగ్..
తెలంగాణలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల అవినీతి ఇక ఏ మాత్రం చెల్లదని కేఏ పాల్ అన్నారు. కేసీఆర్, కేటీఆర్‌లను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎంత ధైర్యం ఉంటే తండ్రీకొడుకులిద్దరూ కలిసి తెలంగాణలో తనపైనే దాడి చేయిస్తారు అని ప్రశ్నించారు. అంతేకాదు.. తనపై దాడి చేయించినందుకుగాను త్వరలోనే మీ ఇద్దరూ ఫలితం ఏంటో చూడబోతున్నారంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
మన దేశం మరో శ్రీలంక కాకూడదని సూచించా..
హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీలో చర్చకొచ్చిన అంశాల గురించి ప్రస్తావిస్తూ.. ఏపీ దాదాపు 8 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని, అలాగే తెలంగాణ కూడా నాలుగున్నర లక్షల కోట్ల అప్పులలో ఉందనే విషయాన్ని గుర్తుచేశారు. దేశం కూడా అప్పుల విషయంలో శ్రీలంక తరహాలో సంక్షోభంలో చిక్కుకోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని అమిత్ షారు సూచించినట్టు కేఏ పాల్ తెలిపారు.
ఎన్నికల బరిలోకి ప్రజా శాంతి పార్టీ..
వచ్చే ఎన్నికల బరిలో అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ ప్రజా శాంతి పార్టీ ఒంటరిగానే పోటీ చేయనున్నట్టు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాకు స్పష్టంచేసినట్టు కేఏ పాల్ (Attack on KA Paul) తెలిపారు. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రికి వివరించానని అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook