Sarkaru Vaari Paata Review: సూపర్ స్టార్ మహేష్ బాబు-కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'సర్కారు వారి పాట.' టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ట్రైలర్ విడుదల వరకు ఈ సినిమా చుట్టూ పాజిటివ్ బజ్ ఏర్పడింది. మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్, సరికొత్త డైలాగ్ మాడ్యులేషన్, తమన్ పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకుల అంచనాలను అందుకుందా... మహేష్ మరో బ్లాక్ బ్లస్టర్ కొట్టాడా.. ఈ రివ్యూలో చూద్దాం.
సర్కారు వారి పాట కథ.. :
సినిమాలో మహేష్ ఒక అనాథ. అతని తల్లిదండ్రులు బ్యాంకు రుణం తీసుకుని... తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన మహేష్.. పెద్దయ్యాక అమెరికాలో ఫైనాన్స్ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. అప్పు తీసుకున్నవారి నుంచి ముక్కు పిండి మరీ వసూలు చేస్తుంటాడు. ఈ క్రమంలో కళావతితో పరిచయం ఏర్పడుతుంది. ఆమె తన చదువు కోసమని 10వేల డాలర్లు డబ్బు మహేష్ నుంచి అప్పుగా తీసుకుంటుంది. అయితే ఆ తర్వాత కళావతి అసలు స్వరూపం మహేష్‌కి తెలుస్తుంది.
కళావతి డబ్బు చెల్లించకపోవడంతో విశాఖలో ఉండే ఆమె తండ్రి రాజేంద్రనాథ్ (సముద్రఖని) నుంచి ఆ డబ్బు వసూలు చేయాలనుకుంటాడు. రాజేంద్రనాథ్ రాజ్యసభ సభ్యుడు. రాజేంద్రనాథ్ నుంచి డబ్బు వసూలు చేసేందుకు మహేష్ విశాఖలో అడుగుపెడుతాడు. అయితే సముద్రఖని నుంచి 10వేల డాలర్లు వసూలు చేసేందుకని వచ్చిన మహేష్... రూ.10 వేల కోట్ల బాకీ తీర్చాలని సముద్రఖనిని డిమాండ్ చేస్తాడు. అసలు ఈ రూ.10వేల కోట్ల కథేంటి... సముద్రఖని నుంచి ఆ డబ్బును ఎలా వసూలు చేశాడనేదే మిగతా కథ.
ప్లస్ పాయింట్స్ :
సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మహేష్ బాబు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశాడు. గత సినిమాల కన్నా స్టైలిష్‌గా, హ్యాండ్సమ్‌గా కనిపించాడు. సరికొత్త డైలాగ్ మాడ్యులేషన్, ఫైట్లతో ఆకట్టుకున్నాడు. మ.. మ... మహేషా సాంగ్‌లో హుషారుగా స్టెప్పులేశాడు. కీర్తి సురేష్ తన అందం, నటనతో ఆకట్టుకుంది. విలన్ పాత్రలో సముద్రఖని ఇరగదీశాడు. సాంగ్స్ పరంగా కళావతి సాంగ్ బాగా పేలింది. తమన్ తన బీజీఎంతో అక్కడక్కడా మెరుపులు మెరిపించాడు. వెన్నెల కిశోర్ కామెడీతో ఆకట్టుకున్నాడు. ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సీన్ బాగుంది. మది సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు పరశురాం ఎంచుకున్న కథా లైన్ బాగున్నప్పటికీ కథనంలో తేడా కొట్టింది. స్క్రీన్ ప్లే మరింత గ్రిప్పింగ్‌గా ఉంటే బాగుండేది. ప్రేక్షకుడు ముందు గానే సన్నివేశాలను ఊహించగలడు. కొన్ని సన్నివేశాలు లాజిక్‌కి అందవు.
బాటమ్ లైన్ : సర్కారు వారి పాట మహేష్ ఫ్యాన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. లాజిక్స్ పక్కనపెడితే మిగతా ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేయగలరు.
Also Read: Shocking News: ఒక్క పొటాటో చిప్ పీస్‌కు ఏకంగా రూ.1.63 లక్షలు.. ఎందుకింత ధరో తెలుసా..?
Also Read: Where Is Cm Kcr: సీఎం కేసీఆర్ ఎక్కడ..! ఫాంహౌజ్ లో ఏం చేస్తున్నారు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook