Mint Tea Benefits: సమ్మర్ లో కొందరు శీతల పానీయం తాగితే మంచిదని భావించి టీకి దూరంగా ఉంటారు. అయితే అలాంటి వారు పుదీనా టీ వల్ల కలిగే ప్రయోజనాలు కచ్చితంగా తెలుసుకోవాలి. పుదీనా టీ తాగడం వల్ల శరీరంలో వేడిమి తగ్గడమే కాకుండా ఆయాసం కూడా దూరమవుతుంది. దీంతో పాటు పుదీనా టీ వల్ల మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
1. శరీరం చల్లగా ఉంటుంది
పుదీనా టీ మీ శరీరాన్ని చల్లబరుస్తుంది. పుదీనా ఆకులలో విటమిన్ - ఎ, విటమిన్ - సి, బి-కాంప్లెక్స్, ఫాస్పరస్, కాల్షియం, యాంటీ బాక్టీరియల్ గుణాలు కూడా ఉన్నాయి. పుదీనా టీ రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరుస్తుంది. మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
2. తలనొప్పి నివారణ
వేసవి కాలంలో చాలా మంది ప్రజలు తలనొప్పి సమస్యను ఎదుర్కొంటారు. అటువంటి పరిస్థితిలో మీరు పుదీనా టీని తీసుకోవడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. పుదీనా టీ వల్ల తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది. అంతే కాకుండా.. అలసట, బలహీనత అనుభూతి చెందదు.
3. బరువు తగ్గుతుంది
బరువు తగ్గాలని నిర్ణయించుకున్న వారు కూడా ప్రతిరోజూ పుదీనా టీ తాగవచ్చు. ప్రతిరోజూ పుదీనా టీ తాగడం వల్ల బరువును తగ్గించుకోవచ్చు. పుదీనాలో కెలరీల పరిమాణం కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల అది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.
పుదీనా టీ ఎలా తయారు చేయాలి?
పుదీనా టీ తయారు చేయడానికి.. ముందుగా మీరు 6 -7 పుదీనా ఆకులను నీటితో శుభ్రంగా కడగాలి. దీని తర్వాత కొన్ని నీటిని వేడి చేసి.. అందులో పుదీనా ఆకులను వేయాలి. ఆ తర్వాత ఆ నీటిని వడపోసి తాగొచ్చు.
(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా టిప్స్, నివారణ చర్యల నుంచి గ్రహించబడింది. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)
Also Read: Curd Benefits For Hair: పెరుగుతో జుట్టుకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?
Also Read: Sabja Seeds Rose Milk: వేసవిలో చల్లదనంతో పాటు..బరువు తగ్గేందుకు అద్భుత డ్రింక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook