Sabja Seeds Rose Milk: మీ సమ్మర్ డైట్‌లో సబ్జా గింజల డ్రింక్ ఉందో లేదో చూసుకోండి. ఒకవేళ లేకపోతే వెంటనే యాడ్ చేయండి. ఇమ్యూనిటీతోపాటు బరువు తగ్గేందుతు ఈ డ్రింక్ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం..
సబ్జా గింజలతో రోజ్ మిల్క్..చూసేందుకు, వినేందుకు అద్భుతంగా ఉన్న ఈ డ్రింక్ రుచి కూడా అత్యద్భుతం. కేవలం రుచి కోసమే కాదు..ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకే ఈ సమ్మర్ స్పెషల్ డ్రింక్ ను మీ డైట్‌లో భాగంగా చేసుకోమంటున్నారు న్యూటిషియన్లు. కేవలం రుచి పరంగానే కాకుండా ఆరోగ్యకరంగా చాలా మంచిది. సబ్జా గింజలతో చేసిన ఈ డ్రింక్ శరీరానికి చలవ చేస్తుంది. అందుకే వేసవిలో ఇది మంచి ప్రత్యామ్నాయం. వేసవిలో నిమ్మరసం, మ్యాంగో షేక్‌ల కంటే ఇది చాలా మంచిది. ఇది మీకు సత్వర శక్తినిస్తుంది. కేవలం 5 నిమిషాల్లో ఈ రుచికరమైన డ్రింక్ తయారు చేసుకోవచ్చు.
సబ్జా గింజలనేవి సాధారణంగా వంటల్లో ఉపయోగిస్తుంటారు. ఈ గింజలతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. శరీరంలోని మెటాబొలిజంను సరి చేస్తుంది. బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. ఇందులో అత్యధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. డయాబెటిస్ పేషెంట్లుకు కూడా ఇది చాలా మంచిది.
సబ్జా గింజలతో కూల్ డ్రింక్ ఎలా తయారు చేయాలి
సబ్జా గింజల్ని రాత్రి వేళ నీళ్లలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదంయ ఆ గింజలు ఉబ్బి.పెద్దగా మారుంటాయి. ఈ గింజల్ని ఓ గ్లాసులో వేయండి. అందులో కొద్దిగా రెడ్ సిరప్ లేదా రూహ్ అఫ్జా వేసి..చిల్డ్ మిల్క్ వేసి కలపండి. ఆ తరువాత కొద్దిగా రోజ్ సిరప్ ఫ్లేవర్ కోసం పోసి..ఒకట్రెండు గులాబీ రేకుల్ని వేయండి. ఎందుకంటే రోజ్ సిరప్, గులాబీ ఆకులు చలవ చేసే పదార్ధాలు. అంతే కాకుండా ఆ డ్రింక్‌ను సూపర్ హైడ్రేటెట్‌గా మారుస్తాయి.
ఈ సబ్జా సీడ్స్ రోస్ సమ్మర్ కూలర్ డ్రింక్ కేవలం రుచిలోనే కాకుండా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. వేసవిలో ఇంటికొచ్చే అతిధులకు ఈ డ్రింక్ తో ఆతిధ్యమిస్తే అద్భుతంగా ఉంటుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే..బరువు తగ్గేందుకు దోహదపడుతుంది.
Also read: Banana Side Effects: అరటిపండ్లు ఎక్కువగా తింటున్నారా... అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్‌తో జాగ్రత్త...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook