IPL Venues: ఐపీఎల్ 15వ సీజన్ నువ్వానేనా అన్నట్లు సాగుతున్నాయి. భారీ అంచనాలున్న జట్లు తడబడుతున్నాయి. ఐపీఎల్‌లోకి కొత్తగా వచ్చిన టీమ్‌లు అలరిస్తున్నాయి. సీజన్ ఆరంభంలో పాయింట్ల పట్టికలో ఆఖరులో ఉన్న జట్లు అనుష్యంగా పుంజుకుంటున్నాయి. పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూసుకొస్తున్నాయి. ముంబై, చెన్నై జట్లు గెలుపు కోసం శ్రమిస్తున్నాయి. గుజరాత్, హైదరాబాద్, రాజస్థాన్, లక్నో జట్లు దుమ్మురేపుతున్నాయి. ముంబై జట్టు ఇప్పటికీ ఖాతా తెరవలేదు. చెన్నై జట్లు కేవలం రెండు విజయాలను మాత్రమే నమోదు చేసింది.
ఈసీజన్‌లో ఇప్పటివరకు 35 మ్యాచ్‌లు పూర్తి అయ్యాయి. మరో 35 లీగ్ మ్యాచ్‌లున్నాయి. సెకండాఫ్‌లో రాణించిన జట్లే ప్లే ఆఫ్స్ వెళ్లే అవకాశం ఉన్నాయి. ఇక నుంచి ప్రతి మ్యాచ్ అన్ని జట్లకు కీలకం కానున్నాయి. రన్‌రేట్ సైతం జట్లకు ముఖ్యం కానుంది. ఈక్రమంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లు జరగబోయే వేదికలను ఖరారు చేసింది.మే 24,26 తేదీల్లో క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈమ్యాచ్‌లు కోల్‌కతా వేదిక కానుంది. మే 27న జరగబోయే క్వాలిఫయర్-2తోపాటు మే 29న జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్ ఆతిథ్యమిస్తుంది.
ఈమేరకు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఓ ప్రకటనలో తెలిపారు. ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌కు వంద శాతం ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు స్పష్టం చేశారు. మే 22 వరకు జరగనున్న లీగ్ మ్యాచ్‌లకు 50 శాతం ప్రేక్షకలను మాత్రమే అనుమతి ఉంటుంది. ఇటు మహిళల టీ20 ఛాలెంజర్స్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 24-28 మధ్య లక్నో వేదికగా మూడు జట్లతో మహిళల టీ20 ఛాలెంజర్స్ టోర్నీ నిర్వహించనుంది.
ఇప్పటివరకు వరకు టాటా ఐపీఎల్‌లో 35 మ్యాచ్‌లు పూర్తైయ్యాయి. పాయింట్ల పట్టికలో గుజరాత్, హైదరాబాద్, రాజస్థాన్, ఆర్‌సీబీ(RCB) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. లక్నో, ఢిల్లీ, కేకేఆర్, పంజాబ్ జట్లు ఆ తర్వాత ఉన్నాయి. చెన్నై, ముంబై జట్లు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మరో 35 మ్యాచ్‌లు మిగిలి ఉండటంతో లీగ్‌లో ఏమైనా జరగొచ్చు. తొలి నాలుగు స్థానాల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
Also read:Tamilisai Soundararajan: తెలంగాణలో వరుస ఘటనలపై గవర్నర్ దృష్టి.. ఏం జరుగుతుందని ఆరా
Also read:Weekly Horoscope: ఈ రాశి వారికి జీవితంలో పెను మార్పులు..వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook