PM Modi J & K Tour: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం (ఏప్రిల్ 24, 2022) జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని, దేశవ్యాప్తంగా గ్రామసభలను ఉద్దేశించి అక్కడ ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం జమ్మూలోని బిష్నాలోని లాలియన్ గ్రామంలోని బహిరంగ వ్యవసాయ భూమిలో పేలుడు సంభవించినట్లు గ్రామస్థులు తెలిపారు. పిడుగుపాటు లేదా ఉల్క పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతున్నట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు వెల్లడించారు.
A suspected blast was reported by villagers in open agricultural land in Lalian village, Bishnah, Jammu. Police is suspecting a lightning strike or a meteorite. Investigation underway: Jammu & Kashmir Police pic.twitter.com/Eyi25d59pf
— ANI (@ANI) April 24, 2022
ఆగస్టు 2019లో జమ్మూ-కశ్మీర్ (Jammu Kashmir) రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తి హోదానిచ్చే ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)...ఆదివారం ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన రూ.20వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో..శుక్రవారం ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు యత్నించారు. సుంజ్వాన్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఒక జవాన్ వీరమరణం పొందగా..మరో 9 మందికి గాయాలయ్యాయి. ముష్కరులకు, సైనికులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు జైష్ ఎ మహ్మద్ కు చెందిన ఉగ్రవాదుల హతమయ్యారు. ఈ క్రమంలో ప్రధాని భద్రతను మరింత పటిష్టం చేశారు అధికారులు. పల్లీ గ్రామంలోని భద్రతా పరిస్థితిని స్వయంగా ఎన్ఐఏ చీఫ్ కులదీప్ సింగ్ సమీక్షించారు.
Also Read: Jammu Terror Attack: సుంజ్వాన్ లోని CISF జవాన్ల బస్సుపై ఉగ్రవాదులు ఎలా దాడి చేశారంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.