Corona in China: కరోనా పుట్టినిల్లు చైనాలో పరిస్థితులు రోజు రోజుకు ఆందోళనకరంగా మారుతున్నాయి. ప్రపంచ దేశాలు కరోనా వల్ల అద్వాన్న పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో.. కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు ప్రకటించుకున్న చైనా.. ఇప్పుడు తీవ్ర పరిస్థితులు ఎదుర్కొంటోంది. రోజువారి కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. దీనితో ఆ దేశంలోనే అతిపెద్ద నగరమైన షాంఘైలో కఠిన ఆంక్షలు అమలు చేస్తేంది ప్రభుత్వం.
కఠిన ఆంక్షలతో జనం విల విల..
కొవిడ్‌ను అదుపు చేసేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన నిబంధనల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం ఆహారంకోసం కూడా బయటకు వెళ్లలేని పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్నట్లు సమాచారం.
తాజాగా చైనాలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఉన్న దృశ్యాలు చూస్తే.. అక్కడ పరిస్థితులు ఎంతగా దిగజారుతున్నాయో, అధికారులు ఎలా ప్రజలను ఆందోళనలకు గురి చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు తెలుస్తోంది.
షాంఘైలోని ఓ ప్రాంతంలోని కమ్యునిటీలోకి పీపీఈ కిట్లు ధరించి వచ్చిన పోలీసులు.. కొవిడ్ సోకినవారందరు సరెండర్ కావాలని హెచ్చరించారు. హెచ్చరికలు పట్టించుకోనివారిని బలవంతంగా ఈడ్చుకెళ్లడం ఈ వీడియోలో చూడొచ్చు.
తమ వాళ్లను బలవంతంగా తీసుకెళ్లడం చూసి ఇంట్లోని ఇతర సభ్యుల రోదనలు ఈ వీడియోలో ఉన్నాయి. మహిళలు కాళ్లు పట్టుకుని బతిమాలినా కనికరించడం లేదు పోలీసులు. ఫ్లాట్లు వదిలి బయటకు వెళ్లకుండా కట్టడి చేస్తున్నట్లు కొందరు మహిళలు ఆరోపిస్తున్నారు. దీని ద్వారా కనీసం ఆహారం కూడా తెచ్చుకోలేని పరిస్థితులు ఏర్పడినట్లు స్థానికులు వాపోతున్నారు.
అసలు కొవిడ్‌పై చేసే పోరాటంలో ప్రజలను చైనా అధికారులు ఎలా చూస్తున్నారో తెలుపుతున్నట్లు ఈ వీడియో చూసిన వారు అంటున్నారు. ఏప్రిల్ 14న జరిగినట్లు చూపిస్తున్న ఈ వీడియోను.. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చూశారు. ఆ భయాణక పరిస్థితులు ఉన్నా వీడియోను మీరు చూడండి.
Forced eviction in #Shanghai, the #CCP needs their homes as #COVID19 #quarantine site. #CCPChina #CCPVirus
English titles added. (I tweeted this before without English subtitles)
能聽懂的地方都加了英文字幕了。這些人給弄到哪裏去了,有誰知道嗎?#上海 #中共病毒 pic.twitter.com/wRZOqaZWMb— Inconvenient Truths by Jennifer Zeng 曾錚真言 (@JenniferZeng15) April 15, 2022
చైనాలో కొవిడ్ కేసులు ఇలా..
చైనాలో ప్రస్తుతం రోజువారి కేసుల సంఖ్య దాదాపు 20 వేలుగా ఉంది. ఇప్పటి వరకు ఈ దేశంలో మొత్తం 174,868 కేసులు నమోదయ్యాయి. ఇందులో 4,638 మంది మహమ్మారికి బలయ్యారు. 145,352 మంది కొవిడ్ నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం ఇంకా 24,878 మంది కొవిడ్ చికిత్స తీసుకుంటున్నారు.
Also read: Brooklyn Subway Shooting: బ్రూక్లిన్‌లో కాల్పుల కలకలం.. రక్తసిక్తమైన సబ్‌వే స్టేషన్
Also read: Countries New Names: ప్రపంచంలోని ఆ దేశాల పాత లేదా కొత్త పేర్లు తెలుస
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook