IPL Mumbai Indians: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. నిన్న పంజాబ్‌తో మ్యాచ్‌లో ఓటమితో ఈ సీజన్లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ముంబై ఓటమిని మూటగట్టుకుంది. గతంలో 2014 ఐపీఎల్ సీజన్లో ఇలాగే వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిన ముంబై జట్టు... మరోసారి దాన్ని రిపీట్ చేసింది. దీంతో ఐపీఎల్లో రెండుసార్లు తొలి ఐదు మ్యాచ్‌ల్లో ఓడిన ఒకే ఒక్క జట్టుగా ముంబై చెత్త రికార్డును సొంతం చేసుకుంది.
పుణేలో బుధవారం (ఏప్రిల్ 13) పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 199 పరుగుల లక్ష్యాన్ని ముంబై చేధించలేకపోయింది. ముంబై బ్యాట్స్‌మెన్‌లో బ్రేవిస్ (49), సూర్య కమార్ యాదవ్ (43) పరుగులతో రాణించగా... మిగతా బ్యాట్స్‌మెన్ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడినప్పటికీ కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. చివరి వరుస బ్యాట్స్‌మెన్ పూర్తిగా చేతులెత్తేయడంతో లక్ష్యానికి దగ్గరగా వెళ్లినప్పటికీ ముంబై విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది.
ఈ ఐపీఎల్ సీజన్ పాయింట్స్ టేబుల్లో ముంబై అట్టడుగున ఉంది. ఇప్పటివరకూ ఢిల్లీ, రాజస్తాన్, కోల్‌కతా, బెంగళూరు, పంజాబ్ జట్లతో ఆడిన మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఓటమిపాలైంది. ఐపీఎల్లో ఐదసార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టు ఇంత పేలవంగా ఆడుతుండటం ముంబై అభిమానులకు మింగుడుపడటం లేదు. ముంబై ప్లే ఆఫ్‌కు చేరాలంటే ఈ సీజన్లో మిగిలిన 9 మ్యాచ్‌ల్లో కనీసం ఏడు మ్యాచ్‌ల్లోనైనా విజయం సాధించాలి. ఒకవేళ తొమ్మిదికి తొమ్మిది లేదా ఎనిమిది గెలిచిన ప్లే ఆఫ్‌లో బెర్త్ దక్కుతుంది. ముంబై తమ తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 16న లక్నో జట్టుతో ఆడనుంది.
Also Read: Monitor Lizard Raped: షాకింగ్... ఉడుముపై గ్యాంగ్ రేప్... సెల్ఫోన్లలో చిత్రీకరణ...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook