/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Fennel Honey Benefits: మనం తరచుగా వాడే ఆహార పదార్థాల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అవి తెలియకపోవడం వల్ల చాలా మంది వాటిని వాడటంలో అశ్రద్ధ వహిస్తుంటారు. అలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సోంపు.. భోజనం తర్వాత సోంపు తినడం చాలా మందికి అలవాటు ఉంటుంది. అయితే అందులో చాలా మంది కేవలం నోటి దుర్వాసన పోగొట్టేందుకే అనుకుంటారు. అయితే సోంపులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. మరో పదార్థం తేనె. తేనేను కూడా గ్రీన్​ టీ వంటి వాటికోసం ఎక్కువగా వాడుతుంటారు. అయితే తేనే అనేది బరువు తగ్గేందుకు కూడా చక్కగా ఉపయోగపడుతుంది.

అయితే అసలు విషయం ఏమిటంటే.. సోంపు, తేనే కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏమిటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

సోంపుతో తేనే కలిపితే..

సోంపులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తిన్న ఆహారం త్వరగా అరగటంలో ఇది సహాయపడుతుంది. ఇందులో కాల్షియం ఎముకలకు ధృడత్వాన్ని ఇస్తుంది. తేనేతో సోంపును కలపి తీసుకోవడం ద్వారా రక్తం శుభ్రపడుతుంది.

చలికాలంలో ఇలా చేస్తే..

శీతాకాలంలో జలుపు సర్వ సాధారణ సమస్య. అయితే సోంపు తేనేను కలిపి తీసుకోవడం వల్ల ఈ సమస్యకు చెక్​ పెట్టొచ్చట. అంతే కాదు.. తేనేని కొద్దిగా వేడి చేసి.. అందులో మెంతుల పొడిని కలిపి తింటే ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు ఉంటాయట.

మలబద్దకానికి చెక్​..

మలబద్ధకం, అజీర్తి, కడుపులో గ్యాస్ వంటి సమస్యలు ఉంటే.. తేనేలో సోంపు వేసుకుని తీసుకోవడం ద్వారా కొద్దికాలంలోనే ఫలితం కనిపిస్తుందని చెబుతున్నారు నిపుణులు.

మచ్చలు మాయం..

చర్మంపై మచ్చలు, కల తప్పడం వంటి సమస్యలు ఉన్నా వారు కూడా.. తేనెలో సోంపు కలిపిన మిశ్రమం తరచుగా తీసుకుంటే.. చర్మం నిగ నిగలాడటం, మచ్చలు తొలగటం వంటి మార్పులు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

(నోట్: ఈ కథనంలోని సమాచారం కేవలం నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. ఇందులో పేర్కొన్న విషయాలను ZEE తెలుగు NEWS ధ్రువీకరించలేదు.)

Also read: Summer Fruits: మండు వేసవిలో ఈ పండ్లను తీసుకుంటే.. మీ బాడీ అస్సలే డీహైడ్రేషన్ కాదు!

Also read: Muskmelon Benefits: కర్బూజతో ఎన్నో ప్రయోజనాలు.. వేసవి తాపాన్ని తట్టుకోవాలంటే ఇలా చేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Section: 
English Title: 
taking fennel mix with honey will have many health benefits here is the details
News Source: 
Home Title: 

Fennel Honey Benefits: సోంపుతో తేనే కలిపి తింటే ఇన్ని ప్రయోజనాలున్నాయా..?

Fennel Honey Benefits: సోంపుతో తేనే కలిపి తింటే ఇన్ని ప్రయోజనాలున్నాయా..?
Caption: 
taking fennel mix with honey will have many health benefits here is the details (representative Image)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

సోంపు తేనే మిశ్రమంతో ఆరోగ్య ప్రయోజనాలు

అజీర్తి నుంచి ముఖంపై మచ్చల సమస్య వరకు చెక్​

ఆయుర్వేద నిపుణులు చెబుతున్న చిట్కాలు

Mobile Title: 
Fennel Honey Benefits: సోంపుతో తేనే కలిపి తింటే ఇన్ని ప్రయోజనాలున్నాయా..?
ZH Telugu Desk
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Wednesday, April 13, 2022 - 19:17
Request Count: 
68
Is Breaking News: 
No