Top 10 Billionaires: మన దేశంలో అత్యంత ధనవంతులు ఎవరు అనే ప్రశ్న వస్తే ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ పేర్లు చెబుతుంటారు. ఇక ప్రపంచంలో అయితే ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, బిల్‌గేట్స్ పేర్లు వినిపిస్తుంటాయి. అయితే ఇందులో టాప్ ఎవరు? ప్రస్తుతం ఎవరి సంపద విలువ? ఇప్పుడు చూసేద్దామా..
ఎలాన్ మస్క్..
ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నది టెస్లా, స్పెస్ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్. 2020 వరకు టాప్ 10 బిలియనీర్ల జాబితాలో కూడా లేని మస్క్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నారు. ఆయన ఆస్తి విలువ 273.3 బిలియన్ డాలర్లుగా అంచనా.
జెఫ్ బెజోస్..
అమెజాన్ వ్యవస్థాపక ఛైర్మన్ జెఫ్ బెజోస్ ప్రస్తుతం ప్రపంచ ధనవంతుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఆయన సంపద అంచనా విలువ 180.2 బిలియన్ డాలర్లు. 2020 వరకు జెఫ్ బెజోస్ వరల్డ్ రిచెస్ట్ పర్సన్స్‌లో అగ్రస్థానంలో ఉండటం గమనార్హం.
బెర్నార్డ్ ఆర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ..
ఎల్వీఎంహెచ్ సీఈఓ, ఆయన ఫ్యామిలీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు. ఓ నివేదిక ప్రకారం వారి సంపద విలువ 166.4 బిలియన్ డాలర్లు.
బిల్‌గేట్స్..
మైక్రోసాఫ్ట్, బిల్ అండ్ మిలిందా గేట్స్ సహ వ్యవస్థాపకుడు.. బిల్ గేట్స్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తి విలువ 134 బిలియన్ డాలర్లు.
వారెన్ బఫెట్..
దిగ్గజ ఇన్వెస్టర్, బెర్క్‌షైర్ హాత్వే సీఈఓ వారెన్ బఫెట్ అత్యంత ధనవంతుల జాబితాలో ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తి అంచనా 127.3 బిలియన్ డాలర్లు.
గౌతమ్ అదానీ..
ఇండియాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ప్రపంచ ధనవంతుల జాబితాలో ఆరో స్థానంలో, ఆసియా, ఇండియాలో అగ్రస్థానంలో ఉన్నారు. గౌతమ్ అదానీ ఆస్తి అంచనా విలువ 117.98 బిలియన్ డాలర్లు.
లారీ పేజ్..
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీపేజ్ ఈ జాబితాలో 7వ స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తి విలువ 113.4 బిలియన్ డాలర్లుగా అంచనా.
లారీ ఎల్లిసన్..
ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ వ్యవస్థాపకుడు, సీటీఓ లారీ ఎల్లిసన్ 113 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచపంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో 8వ స్థానంలో నిలిచారు.
సెర్గీ బ్రిన్..
గూగుల్ మరో సహ వ్యవస్థాపకుడు సెర్గి బ్రిన్ సంపద 109 బిలయన్ డాలర్లు. ప్రపంచ ధనవంతుల్లో ఆయన స్థానం తొమ్మిది.
ముకేశ్ అంబానీ..
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ.. ప్రపంచ ధనవంతుల జాబితాలో నిలిచిన రెండో ఇండియన్ కావడం విశేషం. ముకేశ్ సంపద 98.6 బిలియన్ డాలర్లుగా అంచనా.
నోట్: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో టాప్ 10 మంది, వారి సంపద వివరాలు ఫోర్బ్స్ ప్రకారం చెప్పడం జరిగింది.
Also read: Flipkart Big Saving Days: ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్స్.. రెండు రోజులు మాత్రమే
Also read: iPhone SE 3 Offers: రూ.43,900 విలువైన iPhone SE స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.28,900లకే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook