Salman Butt was not impressed by SunRisers Hyderabad's performance: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ 2021లోని పేలవ ప్రదర్శనను ఐపీఎల్ 2022లోనూ కొనసాగిస్తోంది. గతేడాది ఆడిన 14 మ్యాచులలో కేవలం 3 విజయాలు మాత్రమే అందుకుని పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్.. ఈ ఏడాది ఆడిన రెండు మ్యాచుల్లో ఓటమిపాలైంది. వేదిక, కెప్టెన్, ప్లేయర్స్ మారినా సన్‌రైజర్స్ తలరాత మాత్రం మారడం లేదు. ఇదే విషయాన్ని పాకిస్థాన్ మాజీ సారథి సల్మాన్ భట్ కూడా అంగీకరించాడు. సన్‌రైజర్స్ ఆటగాళ్ల ప్రదర్శన ఆకట్టుకోలేదన్నాడు. ఫ్రాంచైజీలోనే ఏదో లోపం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశాడు.
పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్ తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటములపై స్పందించాడు. 'సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏం మారలేదు. పిచ్ ఏదైనా సరే ఆ జట్టు తలరాత మాత్రం మారడం లేదు. అందుకే ఈ జట్టుతో పాటు ఫ్రాంచైజీలోనూ ఏదో లోపం ఉందని నాకు అనిపిస్తోంది' అని భట్ అన్నాడు. భట్ 2008 సీజన్లో 7 ఐపీఎల్ మ్యాచులు ఆడి 193 రన్స్ చేశాడు.
దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ ఇడెన్ మార్‌క్రమ్ బ్యాటింగ్ ఆర్డర్ సరిగా లేదని సల్మాన్ భట్ పేర్కొన్నాడు. 'ఇడెన్ మార్‌క్రమ్ టాప్ ఆర్డర్ బ్యాటర్. టాప్ ఆర్డర్‌లో చాలా ప్రభావం చూపే ఆటగాడు. పరుగులు సునాయాసంగా చేస్తాడు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ మాత్రం మార్‌క్రమ్‌ను నాలుగు, ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దింపుతోంది. అతడు టాప్ ఆర్డర్‌లో అయితే దూకుడుగా ఆడగలడు. ప్రస్తుతం ఆడుతున్న స్థానాల్లో ఎక్కువగా స్కోరు చేయలేడు' అని సల్మాన్ భట్ వివరించాడు.
సోమవారం చివరి ఓవర్ వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో లక్నో12 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ జట్టుపై విజయం సాధించింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (68; 50 బంతుల్లో 6×4, 1×6), దీపక్ హుడా (51; 33 బంతుల్లో 3×4, 3×6) హాఫ్ సెంచరీలు చేయడంతో లక్నో 7 వికెట్లకు 169 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ (2/28), నటరాజన్ (2/26) రాణించారు. అనంతరం అవేష్ ఖాన్ (4/24), కృనాల్ పాండ్య (2/27), హోల్డర్ (3/34) దాటికి హైదరాబాద్ 9 వికెట్లకు 157 పరుగులే చేసి ఓడిపోయింది. రాహుల్ త్రిపాఠి (44; 30 బంతుల్లో 5×4, 1×6), నికోలస్ పూరన్ (34; 24 బంతుల్లో 3×4, 2×6) జట్టును గెలిపించే ప్రయత్నం చేశారు.
Also Read: Vimala Raman Wedding: తమిళవిలన్‌ను పెళ్లాడనున్న టాలీవుడ్ హీరోయిన్?
Also Read: IPL 2022 Points Table: ఐదో స్థానంలో లక్నో.. అట్టడుగు స్థానంలో హైదరాబాద్! ఆరెంజ్ క్యాప్ రేసులో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook