Revanth Reddy on KTR: ఆగని ట్విట్టర్ వార్... కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్...

Revanth Reddy counter to KTR: తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 30, 2022, 02:59 PM IST
  • వరి ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్, కాంగ్రెస్ ట్విట్టర్ వార్
  • రాహుల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్, కవిత
  • కేటీఆర్, కవితలకు రేవంత్ రెడ్డి కౌంటర్
Revanth Reddy on KTR: ఆగని ట్విట్టర్ వార్... కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్...

Revanth Reddy counter to KTR: తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ ట్వీట్‌తో మొదలైన ఈ వార్ ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. రైతుల విషయంలో టీఆర్ఎస్, బీజేపీలు రాజకీయం చేస్తున్నాయని రాహుల్ విమర్శించడంతో.. మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కేటీఆర్ కౌంటర్‌పై తాజాగా ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు.

దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 50 ఏళ్ల పాటు అధికారం ఇస్తే... అధికారంలో ఉన్న కాలంలో రైతులకు కనీసం ఆరు గంటల విద్యుత్ ఇవ్వలేకపోయారని, తద్వారా రైతులు క్షోభతో ఆత్మహత్యలు చేసుకున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను రేవంత్ తప్పు పట్టారు. రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ నిబద్దతత గురించి కేటీఆర్‌కు తెలియకపోవడం పట్ల జాలి పడుతున్నట్లు తెలిపారు. 'రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీ తండ్రిని అడిగితే బెటర్.. కానీ ఆయన రైతుల సమస్యలను రాజకీయం చేయడంలో బిజీగా ఉండొచ్చు.' అని రేవంత్ విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 7వేల పైచిలుకు మంది రైతులను పొట్టనబెట్టుకుందని ఆరోపించారు. 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వడం ద్వారా 4 కోట్ల ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు తీసుకొచ్చామన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఆర్టీఈ, ఆర్టీఐ చట్టాలను కూడా తీసుకొచ్చిందని... తద్వారా మీలాంటి ప్రభుత్వాలను ప్రజలు జవాబుదారీగా ఉంచగలుగుతున్నారని పేర్కొన్నారు.

ఇదే అంశానికి సంబంధించి రాహుల్ గాంధీ ట్వీట్‌కు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇవ్వగా... రేవంత్ రెడ్డి స్పందించిన సంగతి తెలిసిందే. రాజకీయ లబ్ది కోసం నామమాత్రంగా ట్విట్టర్‌లో సంఘీభావం తెలపకుండా.. పార్లమెంట్‌లో నిరసన తెలుపుతున్న టీఆర్ఎస్ ఎంపీలకు మద్దతుగా నిలవాలని రాహుల్‌ని కవిత కోరారు. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి..  టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభలో పోరాటం చేయట్లేదని, సెంట్రల్ హాల్లో కాలక్షేపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ కూడా ఈ విషయంలో కవితకు కౌంటర్ ఇచ్చారు. ఠాగూర్ ట్వీట్‌పై స్పందించిన కవిత... ఈ అహంకాపూరిత ధోరణి వల్లే పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ రెండంకెలకు పరిమితమైందని గట్టి కౌంటర్ ఇచ్చారు. 

Also Read: Prabhas Salaar: మోకాలి సర్జరీ కోసం విదేశాలకు ప్రభాస్...! ఆగిన సలార్ షూటింగ్...

Also read: Shanghai lockdown: చైనాలో కొవిడ్ భయాలు- నిర్బందంలో షాంఘై ప్రజలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News