Coffee Benefits: నిత్య జీవితంలో కాఫీ, టీ అలవాటు చాలామందికి ఉంటుంది. కాఫీ,టీలు సేవిస్తే ఆరోగ్యానికి మంచిది కాదనే అభిప్రాయం కూడా ఉంది. అయితే..రోజూ కాఫీ తాగితే గుండెకు మాత్రం మంచిదే అంటున్నారు వైద్య నిపుణులు..
ప్రతిరోజూ లేవగానే బెడ్ కాఫీ లేదా బెడ్ టీ. చాలామంది దినచర్య వీటితోనే ప్రారంభమవుతుంది. అదే సమయంలో కాఫీ, టీల వల్ల ప్రయోజనాలున్నాయా లేదా దుష్పరిణాలున్నాయా అనేది ఇప్పటికీ సందేహమే. ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతుంటారు. ఎక్కువమంది కాఫీ, టీ ఒంటికి మంచిది కాదంటారు. కానీ బ్రిటన్‌లో చేసిన ఆ అధ్యయనం మాత్రం కాఫీతో గుండె పదిలమంటున్నారు. ఆ వివరాలు పరిశీలిద్దాం..
కాఫీ, టీ ఎక్కువగా తీసుకుంటే కొద్దిపాటి అనారోగ్య సమస్యలు తలెత్తే మాట వాస్తవమే. కానీ అంతకుమించి ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనం ఉంటుందని తెలుస్తోంది. కాఫీ తాగితే గుండెకు చాలా మేలు చేకూరుతుందని లండన్‌లో ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది. రోజుకు 2-3 కప్పుల కాఫీ తాగితే..హృద్రోగాలు, గుండె సంబంధిత సమస్యలతో తక్కువ వయస్సులోనే మరణించడమేది 10-15 శాతం తగ్గుతుందట. గత పదేళ్లుగా బ్రిటన్‌లోని 5 లక్షలమందిపై నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడైంది.
Also read: Summer Tips: వేసవిలో ఎంత నీరు తీసుకోవాలి, ఒకేసారి తీసుకోవడం ఎందుకు ప్రమాదకరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.