Akasa Air: బిగ్ బుల్ రాకేశ్ ఝున్ ఝున్ వాలా.. ప్రధాన ప్రమోటర్‌గా ఉన్న బడ్జెట్ ఎయిర్‌లైన్స్ 'ఆకాశ ఎయిర్' నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఈ సంస్థ కార్యకలాపాలను వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సంస్థ సీఈఓ వినయ్ దూబే ఓ ప్రకట కూడా చేశారు.
ఈ ఏడాది జూన్ నుంచి సంస్థ విమానాలను నడిపించే యోజనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆకాశ ఎయిర్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)తో.. అవసరమైన లైసెన్స్‌లను పొందేందుకు చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు వినయ్ దూబే.
హైదరాబాద్‌లోని బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో జరుగుతున్న 'వింగ్స్ ఇండియా 2022' ఏవియేషన్ షోలో పాల్గొన్న వినయ్ దూబే.. ఆకాశ ఎయిర్ గురించి ప్రస్తావించారు. జూన్‌లో మొదటి ఫ్లైట్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించిన దూబే.. ఏ నగరాల మధ్య నడుస్తుంది అనే విషయం మాత్రం వెల్లడించలేదు.
అయితే మొదటి ఫ్లైట్ ప్రారంభమైన తర్వాత.. ఏడాది లోపు మొత్తం 18 విమానాలను నడిపించనున్నట్లు వివరించారు. ఆ తర్వాత ఏడాదిలోపు మరో 12-14 విమానాలను సంస్థలోకి చేర్చుకోనున్నట్లు వెల్లడించారు దూబే. గత ఏడాది నవంబర్‌లో ఆకాశ ఎయిర్ 72 బోయింగ్ 737 మ్యాక్స్ జెట్స్ కోసం.. ఆర్డర్ ఇచ్చింది.
Also read: Indian Exports: 2021-22లో భారత స్మార్ట్ఫోన్ల ఎగుమతులు 83 శాతం జంప్!
Also read: EPFO E-nomination: ఈ-నామినేషన్ దాఖలు అవసరం ఎంత? చేయకుంటే ఏమౌతుంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook