EPFO E-nomination: మీరు సంఘటిత రంగాల్లోని ఏదైనా సంస్థలో పని చేస్తున్నారా? అయితే మీకు ఓ అలర్ట్. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్ఓ) నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఈపీఎఫ్ ఖాతాదారులు ఈ-నామినేషన్ దాఖలు చేయడం తప్పనిసరి. ఈ-నామినేషన్ చేయకుంటే.. పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కుదరదు. దీనితో పాటు.. ఈ-నామినేషన్ ఎందుకు అవసరమో ఇప్పుడు చూద్దాం.
ఈ-నామినేషన్ ఎందుకు?
ఈపీఎఫ్ ఖాతాదారుల కుటుంబానికి సామాజిక, ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో.. ఈ-నామినేషన్ తప్పనిసరి చేసింది. నామినికి సంబంధించిన సమగ్ర వివరాలు సమర్పించేందుకు.. ఈ-నామినేషన్ అవకాశం కల్పిస్తుంది. అంతే కాకుండా ఈ-నామినేషన్ సమర్పించడం ద్వారా.. ఖాతాదారుడికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి మరణం సంభవిస్తే.. నామినీకి పీఎఫ్ జమ డబ్బులతో పాటు పెన్షన వంటివి ఇచ్చేందుకు వీలుపడుతుంది. ఈ-నామినేషన్ ద్వారా పూర్తిగా ఆన్లైన్ ద్వారానే నామిని.. చందాదారుడి జమ డబ్బులను తీసుకోవచ్చు.
బీమా కూడా..
ఈపీఎఫ్ఓ ఖాతాదారులు.. ఈ-నామినేషన్ పూర్తి చేయడం ద్వారా ఎంప్లాయ్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఈడీఎల్ఐ ఇన్సూరెన్స్ కవర్) ద్వారా రూ.7 లక్షల బీమాకు అర్హత సాధిస్తారు. అంటే ఈపీఎఫ్ఓ చందాదారుడు ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు.. నామినీకి రూ.7 లక్షల వరకు బీమా లభిస్తుంది.
ఈ-నామినేషన్ చేయడం ఎలా?
నోట్: ఈపీఎఫ్ఓ ఈ-నామినేషన్ దాఖలు చేసేందుకు చివరి తేదీ అంటూ లేదు. ఎప్పుడైనా ఈ-నామినేషన్ దాఖలు చేయొచ్చని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
EPFO E-nomination: ఈ-నామినేషన్ దాఖలు అవసరం ఎంత? చేయకుంటే ఏమౌతుంది?
ఈపీఎఫ్ఓ ఈ-నామినేషన్ దాఖలు చేయడం ఎలా?
ఈ-నామినేషన్ దాఖలు చేసేందుకు చివరి తేదీ ఏది?
ఈ ప్రక్రియ పూర్తి చేయకుంటే ఏమవుతుంది?