Pushkar Singh Dhami as Secoond Term CM: ఉత్తరాఖండ్ సీఎంగా మరోసారి పుష్కర్ సింగ్ ధామికే అవకాశం దక్కింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ధామి ఓడిపోయినప్పటికీ.. ప్రభుత్వ పగ్గాలు ఆయనకే అప్పగించాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించింది. సోమవారం (మార్చి 21) జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో పుష్కర్ సింగ్ ధామిని పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. డెహ్రాడూన్‌లో జరిగిన ఈ సమావేశానికి బీజేపీ కేంద్ర అబ్జర్వర్లుగా కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీనియర్ నేత మీనాక్షి లేఖి హాజరయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పుష్కర్ సింగ్ ధామి ఓడిపోవడంతో సీఎంగా ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారన్న దానిపై గత 11 రోజులుగా చర్చ జరుగుతోంది. . సీఎం రేసులో పుష్కర్ సింగ్తో పాటు మాజీ కేంద్ర మంత్రి రమేష్ పోక్రియాల్ నిశాంక్, ఎమ్మెల్యే అనిల్ బలూనీ, ధన్‌సింగ్ రావత్, సత్పాల్ మహరాజ్‌ల పేర్లు ప్రధానంగా వినిపించాయి. అయితే బీజేపీ అధిష్ఠానం మాత్రం పుష్కర్ సింగ్ ధామి వైపే మొగ్గుచూపింది.
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందే సీఎంగా ధామి బాధ్యతలు చేపట్టినప్పటికీ.. పాలనలో తనదైన మార్క్ చూపించారని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది. అందుకే రెండో సారి కూడా ఆయనకే అవకాశం ఇచ్చింది.ఈ నెల 23న పుష్కర్ సింగ్ ధామి ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో పుష్కర్ సింగ్ ధామి ఖతిమా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిన సంగతి తెలిసిందే. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి 2012, 2017లో వరుసగా రెండుసార్లు ధామి గెలుపొందారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి భువన్ చంద్ర కాప్రిపై 6579 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
जनप्रिय नेता श्री @pushkardhami जी को भाजपा विधायक दल का नेता बनाए जाने पर समस्त भाजपा परिवार एवं देवतुल्य जनता की तरफ से हार्दिक बधाई एवं शुभकामनाएं। pic.twitter.com/cmMOMczZEq
— BJP Uttarakhand (@BJP4UK) March 21, 2022
Also Read: Leopard Hunting Video: కసిగా వేటాడిన చిరుతపులి.. వెంటనే పట్టుబడిన మొసలి.. వీడియో వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Pushkar Singh Dhami: ఓడినా పుష్కర్ సింగ్ ధామికే పగ్గాలు... రెండోసారి సీఎంగా ఛాన్స్
రెండోసారి ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్ సింగ్ ధామి
బీజేపీ శాసనసభాపక్ష నేతగా ధామి ఎన్నిక
ఎన్నికల్లో ఓడినా ఆయనకే ఛాన్స్ ఇచ్చిన బీజేపీ