Morning Walk Benefits: కరోనా సంక్షోభం కారణంగా గత రెండేళ్లుగా చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు. దీంతో ఎక్కువ శారీరక శ్రమ లేని కారణంగా వారిలో అనేక మంది అధికంగా బరువు పెరిగినట్లు సర్వేలు చెబుతున్నాయి. అధిక బరువు కారణంగా పొట్ట పెరుగుతుంది. అందులో బెల్లీ ఫ్యాట్ సమస్య ప్రతి ఒక్కరినీ వేధిస్తుంటుంది. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడం సులభం.
మార్నింగ్ వాక్ వల్ల కలిగే ప్రయోజనాలు..
ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లడం వల్ల శరీరంలోని క్యాలరీలను తగ్గించుకోవచ్చు. అయితే మార్నింగ్ వాక్ కు వెళ్లేవారు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కూడా ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. బరువు తగ్గడానికి స్లో వాక్ కాకుండా స్పీడ్ వాక్ ప్రాక్టీస్ చేయండి.
2. నెమ్మదిగా నడవడం ద్వారా వేగవంతమైన నడకను ప్రారంభించండి. ఆ తర్వాత దాన్ని వేగవంతం చేయండి.
3. వేగంగా వెళుతున్నప్పుడు మీ పాదాలను వణికిస్తూ ముందుకు సాగండి.
4. ఈ విధంగా నడిచేటప్పుడు శరీరంపై ఒత్తిడి లేకుండా ఉండేలా మీ శరీరాన్ని నిటారుగా ఉంచండి.
5. నిదానంగా నడవడం మానుకోవాలి.. లేదంటే పొట్ట కొవ్వు తగ్గడంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.
6. మార్నింగ్ వాక్ చేసే వారు వెంట వెంటనే విశ్రాంతి తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గడంలో జాప్యం జరగవచ్చు.
7. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజూ అరగంట పాటు స్పీడ్ వాక్ చేస్తే, ఆ ప్రభావం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది.
8. బెల్లీ ఫ్యాట్ తగ్గడంలో మెరుగైన ఫలితాలు వచ్చేంత వరకు మార్నింగ్ వాక్ అలవాటును కొనసాగించండి. బెల్లీ ఫ్యాట్ తగ్గకముందే విశ్రాంతి తీసుకోవద్దు.
ALso Read: Almond Oil Benefits: చుండ్రుతో బాధపడే వారు ఈ రెండు ఇంటి చిట్కాలను పాటించండి!
Also Read: Neck Pain After Sleeping: నిద్రలో మెడ కండరాలు పట్టేస్తున్నాయా? అయితే ఈ టిప్స్ పాటించండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook