AP Inter Revised Schedule: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలకు ప్రభుత్వం కొత్త షెడ్యూల్ ప్రకటించింది. పదో తరగతి పాత షెడ్యూల్ ను మార్చుతూ, కొత్త తేదీలు వెల్లడించింది. తాజా షెడ్యూల్ ప్రకారం... ఏప్రిల్ 27 నుంచి మే 9వ తేదీ వరకు టెన్త్ క్లాస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ పరీక్షలను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. పాఠశాల విద్యాశాఖ, ఇంటర్ బోర్డు సమావేశం అనంతరం కొత్త షెడ్యూళ్లకు రూపకల్పన చేశారు. పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్...
ఏప్రిల్ 27- తెలుగు
ఏప్రిల్ 28- సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 29- ఇంగ్లీష్
మే 2- మ్యాథ్స్
మే 4- సైన్స్ పేపర్ 1
మే 5- సైన్స్ పేపర్ 2
మే 6- సోషల్ స్టడీస్
ఇంటర్ పరీక్షలకు కూడా కొత్త షెడ్యూల్ ప్రకటించారు. మే 6 నుంచి 23వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
AP Inter Revised Schedule: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలకు కొత్త షెడ్యూల్ ప్రకటించిన ప్రభుత్వం
టెన్త్, ఇంటర్ పరీక్షలకు కొత్త షెడ్యూల్ ప్రకటించిన ప్రభుత్వం
ఏప్రిల్ 27 నుంచి మే 9వ తేదీ వరకు టెన్త్ క్లాస్ పరీక్షలు
ఉ. 9.30 నుంచి మ. 12.45 గంటల వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలు