భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలామంది అభిమానులు ధోనిపై ఉన్న ప్రేమను చాలా సందర్భాల్లో చాటుకున్నారు. ధోని ఏం చేసినా అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతాయి.
ఇటీవల లక్నోలో జరిగిన ఓ కార్యక్రమం జరిగింది. అందులో ధోనీ పాల్గొన్నాడు. అయితే ఓ లిటిల్ అభిమాని నుంచి ధోనీకి ఊహించని సంఘటన ఎదురైంది. ధోని చేతుల మీదుగా బహుమతి అందుకోవడానికి వేదికపైకి వచ్చిన ఆ అభిమాని రాగానేవెంటనే ధోని కాళ్ల మీద పడి పాదాలను ముద్దాడాడు. దీంతో అక్కడి వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికిలోనయ్యారు. వెంటనే తేరుకున్న ధోని అతన్ని పైకి లేపి కౌగిలించుకొని మరీ ఓ సెల్ఫీ దిగాడు. అంతేకాదు ఓ బ్యాట్‌ను గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆనందంతో మరోసారి ఆ అభిమాని పాదాభివందనం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మీరూ ఆ వీడియోను చూడండి..