మయన్మార్ అధ్యక్షుడు హితిన్‌ క్యా రాజీనామా

మయన్మార్ దేశ అధ్యక్షుడు అధ్యక్షుడు హితిన్‌ క్యా రాజీనామా చేశారు.

Last Updated : Mar 21, 2018, 03:44 PM IST
మయన్మార్ అధ్యక్షుడు హితిన్‌ క్యా రాజీనామా

మయన్మార్ దేశ అధ్యక్షుడు అధ్యక్షుడు హితిన్‌ క్యా రాజీనామా చేశారు. ప్రస్తుత బాధ్యతలు, విధుల నుంచి విశ్రాంతి తీసుకునేందుకు ఆయన రాజీనామా చేశారని అధ్యక్ష కార్యాలయం ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. మయన్మార్‌ రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడు రాజీనామా చేస్తే ఉపాధ్యక్షులు అధ్యక్ష బాధ్యతలు(ఇంచార్జ్) చేపడతారు. వారం రోజుల్లోగా పార్లమెంట్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. అప్పటివరకు ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఉన్న మింట్‌ స్వీ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.

71 ఏళ్ల హితేన్‌ అనారోగ్య కారణంగానే అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగారని ఎన్‌ఎల్‌డీ పార్టీ అధికార ప్రతినిధి అంగ్‌ షిన్‌ తెలిపారు. పార్టీకి చెందిన మరో వ్యక్తి వారం రోజుల్లో అధ్యక్షునిగా ఎన్నికవుతారని, రాజ్యాంగం ప్రకారం ప్రస్తుత ఉపాధ్యక్షుడిని అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశం లేదని స్పష్టం చేశారు.

2016లో జరిగిన ఎన్నికల్లో అంగ్‌సాన్‌ సూకీ పార్టీ నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ ఎన్నికల్లో విజయం సాధించింది. అప్పుడు అంగ్‌సాన్‌ సూకీనే అధ్యక్షురాలు అవుతుందని అనుకున్నారు. కానీ ఆ దేశ రాజ్యాంగం ప్రకారం.. పదేశస్తుడిని పెళ్లి చేసుకున్న కారణంగా సూకీ అధ్యక్ష పదవికి దూరమయ్యారు. ఆమె స్థానంలో తను అత్యంత విధేయుడైన హితేన్‌కు పట్టం కట్టి సలహాదారుగా వ్యవహరించారు. ప్రధాని హోదాకు సమానమైన స్టేట్‌ కౌన్సిలర్‌గా, విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే దేశ పాలనలో తనదైన ముద్ర వేశారు. కానీ రోహింగ్యాల విషయంలో అంగ్‌సాన్‌ సూకీ, హితేన్‌ ఇతర దేశాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నారు.

 

Trending News