Radhe Shyam OTT Release: పాన్ ఇండియా ప్రభాస్ (Prabhas), పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'రాధేశ్యామ్' (Radhe Shyam Movie). 1960 నాటి వింటేజ్ ప్రేమకథ తెరకెక్కిన ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి...మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకునేందుకు పలు సంస్థలు పోటీపడుతున్నట్లు వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) భారీ మెుత్తానికి రాధేశ్యామ్‌ను సొంతం చేసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. సాధారణంగా ఏ సినిమా అయిన థియేట్రికల్ రిలీజ్ అనంతరం 4 వారాల తర్వాతే డిజిటల్ ప్లాట్‌ఫాంకు వస్తుంది. అంటే 'రాధేశ్యామ్' ఏప్రిల్ 11 తర్వాతే ఓటీటీలోకి అడుగుపెట్టాలి. కానీ ఏప్రిల్ 2న ఉగాది పండగ ఉండటంతో ఆ రోజే మధ్యాహ్నం 12 గంటల నుంచి రాధేశ్యామ్ స్ట్రీమింగ్ చేయాలని అమెజాన్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Radhe Shyam Collection: రాధే శ్యామ్ రెండు రోజుల్లో రూ.119 కోట్ల వసూళ్లు- మూడో రోజు ఎంతంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook