Skin Care Tips: వేసవిలో చర్మాన్ని ఎలా సంరక్షించుకోవాలి, ఏం వాడకూడదు

Summer skin care: ఎండాకాలం వచ్చేసింది. మీ స్కిన్‌కేర్, ముఖ్యంగా ముఖ సౌందర్యం కాపాడుకోవల్సిన అవసరముంది. మండు వేసవిలో స్కిన్‌కేర్ కోసం ఏం చేయాలి, ఏం చేయకూడదనేది ఇప్పుడు పరిశీలిద్దాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 5, 2022, 04:31 PM IST
Skin Care Tips: వేసవిలో చర్మాన్ని ఎలా సంరక్షించుకోవాలి, ఏం వాడకూడదు

Summer skin care: ఎండాకాలం వచ్చేసింది. మీ స్కిన్‌కేర్, ముఖ్యంగా ముఖ సౌందర్యం కాపాడుకోవల్సిన అవసరముంది. మండు వేసవిలో స్కిన్‌కేర్ కోసం ఏం చేయాలి, ఏం చేయకూడదనేది ఇప్పుడు పరిశీలిద్దాం.

ఎండాకాలం వచ్చిందంటే చాలు ఆరోగ్యపరంగా చాలా సంరక్షణ చర్యలు తీసుకోవల్సి వస్తుంది. ముఖ్యంగా చర్మం విషయంలో ఇంకాస్త ఎక్కువ జాగ్రత్త అవసరం. ఎండ నుంచి మీ చర్మాన్ని కాపాడుకోవల్సిన అవసరముంటుంది. సూర్యుని నుంచి నేరుగా వచ్చే అతి నీలలోహిత కిరణాలు కల్గించే హాని నుంచి చర్మాన్ని రక్షించుకోవాలి. అందుకే వేసవి వచ్చిందంటే చాలా సన్‌స్క్రీన్ లోషన్స్ ఎక్కువగా వాడుకలో వస్తుంటాయి. సన్‌స్క్రీన్ లోషన్స్ ద్వారా స్కిన్‌కేర్ తప్పనిసరి. ఇక వేసవిలో చాలామందికి చెమట కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు క్లెన్సర్ వాడటం మంచిది. అయితే రసాయనాలు లేని క్లెన్సర్ వాడటం మంచిది.

ఇక వేసవి వేడిలో ముఖానికి నూనె లేదా సీరమ్ ఉపయోగించడం ఎంతమాత్రం మంచిది కాదు. వేసవి కారణంగా చెమట, జిడ్డు ఎక్కువగా ఉంటుంది. నూనె వంటివి రాస్తే..చర్మం మరింత జిడ్డుగా మారుతుంది. వేసవి కాలంలో చర్మ సంరక్షణ కోసం సాధ్యమైనంత వరకూ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచాలి. చర్మానికి తగిన తేమ లేకపోతే..అనారోగ్యం కారణంగా చర్మ సమస్యలు వెంటాడుతాయి. బ్లాక్‌హెడ్స్, డ్రై స్కిన్ వంటివి సమస్యలెదురవుతాయి. చర్మం తేమగా ఉండేందుకు వీలుగా మాయిశ్చరైజర్ తప్పకుండా ఉపయోగించాలి. మృదువైన, ఆరోగ్యకరమైన చర్మం కోసం మాయిశ్చరైజర్ వాడాలని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు వీలుగా వేసవిలో ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. ఎండలో వెళ్లేటప్పుడు ముఖంపై అలసట, చికాకు లేకుండా ఉండాలంటే టోనర్ తప్పకుండా వాడమంటున్నారు. టోనర్ అనేది చర్మంలో పీహెచ్ స్థాయిని స్థిరంగా ఉంచుతుంది. ఫలితంగా చర్మం కాంతివంతంగా ఉంటుంది. వేసవిలో చర్మతత్వానికి తగ్గట్టుగా సోపు ఎంచుకోవాలి. ఎండలోంచి వచ్చిన వెంటనే..చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవడం అత్యంత ఉత్తమమైన మార్గం. 

Also read: Nail Cutting Myths: రాత్రిపూట గోర్లు కట్ చేయకూడదని పెద్దలు అంటారు.. కారణమేంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News