బెంగళూరు: భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ బెంగళూరు కంపెనీపై కేసు వేశారు. తాను రూ.4 కోట్ల మేర మోసపోయానంటూ బెంగళూరుకు చెందిన విక్రమ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీపై ద్రవిడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం పోలీస్ స్టేషన్లో ద్రవిడ్ ఫిర్యాదు చేసినట్లు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు.
వివరాల్లోకెళితే.. 2014లో కంపెనీ తీసుకొచ్చిన పోంజీ పథకంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయంటూ కంపెనీ ప్రముఖ క్రీడాకారులతో పాటు సెలెబ్రెటీలను మోసం చేసింది. ఇందులో రూ.20 కోట్లు పెట్టుబడి పెడితే ఇప్పటి వరకు రూ.16 కోట్లు తిరిగి వచ్చాయని, రూ.4 కోట్లు ఎగ్గొట్టిందని ద్రవిడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంపెనీ యాజమాని రాఘవేంద్ర శ్రీనాథ్, ఏజెంట్లు సూత్రం సురేశ్, నరసింహమూర్తి, కేసీ నాగరాజ్, ప్రహ్లాద్‌లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. పోంజీలో పెట్టుబడి పెట్టి మోసపోయిన వారిలో ద్రవిడ్‌తో పాటు సైనా నెహ్వాల్, ప్రకాశ్ పదుకోన్ లు ఉన్నారు.