ఏపీలో టెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు టెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫైనల్ కీ మేరకు వాల్యుయేషన్ చేసి ఫలితాలను విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.
ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లు ఫిబ్రవరి 21 నుండి మార్చి 2 వరకు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 4,46,833 మంది దరఖాస్తు చేసుకున్న ఈ పరీక్షకు 4,10,828 (91.94 శాతం) మంది హాజరయ్యారు. కంప్యూటర్ ఆధారితంగా 190 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఏపీటెట్-2017 ప్రాథమిక 'కీ'ని మార్చి 4న విడుదల చేశారు. ప్రాథమిక కీపై 4 నుంచి 9వ తేదీ సాయంత్రం 5గంటల వరకూ అభ్యంతరాలను స్వీకరించిన విద్యాశాఖ అధికారులు.. నేడు విజయవాడలోని ఓ ప్రవేట్ హోటల్ లో ఫలితాలను విడుదల చేయనున్నారు. మరింత సమాచారం కోసం aptet.apcfss.in వెబ్ సైట్ ని సందర్శించండి.