Turmeric Milk Benefits: ప్రతిరోజూ నిద్రించే ముందు పసుపు కలిపిన పాలను తాగమని సలహా ఇస్తారు. అలా చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు వైద్య నిపుణలు కూడా చెబుతున్నారు. పాలలో పసుపు కలిపి తాగితే శరీరానికి యాంటీ బయాటిక్స్, కాల్షియం తగినంత అందుతుందని తెలుస్తోంది. పసుపు పాలు తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. అయితే పసుపు పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జలుబు నుంచి ఉపశమనం
సాధారణంగా జలుబు, దగ్గు సమస్యలను ఎదుర్కొనే వారు ప్రతిరోజూ తప్పనిసరిగా పసుపు కలిపిన పాలను తాగడం వల్ల మేలు జరుగుతుంది. ఇందులో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. పసుపు పాలను ప్రతిరోజూ తాగడం వల్ల జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. దీంతో పాటు గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కూడా తగ్గుముఖం పడతాయి.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
ప్రతిరోజూ పసుపు పాలు తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పసుపు పాలలోని కర్కుమిన్ ఇమ్యునోమోడ్యులేటర్ ఉంటుంది. ఇది అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.
కీళ్ల నొప్పులకు స్వస్తి..
పసుపు పాలు తాగడం వల్ల కడుపులో మంట తగ్గుతుంది. శీతాకాలంలో తీవ్రంగా మారే కీళ్ల నొప్పులకు ఔషధంగా పనిచేస్తుంది. శరీరంపై ఏర్పడే అవాంఛిత వాపులను ఉపశమనం లభిస్తుంది.
గుండెకు మేలు..
ప్రతిరోజూ రాత్రి నిద్రించే ముందు పసులు పాలు తాగడం వల్ల గుండెకు మేలు జరుగుతుంది. పసుపు పాలు క్రమంగా తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా కొన్ని నివేదికల నుంచి గ్రహించబడింది. ఈ చిట్కాలను పాటించే ముందు సంబంధిత వైద్యుడ్ని సంప్రదించడం మంచిది. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరిచడం లేదు.)
Also Read: Curd Sugar Benefits: పెరుగు, చక్కెర కలిపి తింటే కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?
Also Read: Belly Fat Loss Drink: ఈ డ్రింక్ తాగితే కేవలం నెల రోజుల్లో మీ బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.