Rohit Sharama LaLiga Home Goals Challenge: భారత దేశంలో క్రికెట్ ఆటకు ఉన్న క్రేజ్ మరే క్రీడకు ఉండదు అన్న విషయం తెలిసిందే. మన దేశంలో క్రికెట్‌ను ఓ మతంలా భావిస్తారు. క్రికెట్ మ్యాచ్ ఎక్కడ జరిగినా మైదానాలు మొత్తం కిక్కిరిసిపోతాయి. టెస్ట్, వన్డే, టీ20, ఐపీఎల్ మ్యాచ్ ఏదైనా అభిమానులు ఆస్వాదిస్తారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న ఫుట్‌బాల్ ఆటకు మాత్రం మన దగ్గర అంతగా ఆదరణ లేదు. అందుకే లాలిగా ఫుట్‌బాల్ లీగ్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. దాంతో భారత్‌లో కూడా లాలిగాను ప్రమోట్ చేస్తున్నారు.
లాలిగా ఆధ్వర్యంలో రోహిత్ శర్మ '#HitmanAtHome' అనే డిజిటల్ ప్రచారాన్ని ప్రకటించాడు. ఈ ఛాలెంజ్‌లో నెగ్గిన మొదటి ఐదు విజేతలు లాలిగా బ్రాండ్ అంబాసిడర్‌తో (రోహిత్) మాట్లాడే అవకాశాన్ని పొందుతారన్నాడు. లాలిగా అభిమాని అయిన రోహిత్ శర్మ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో తన స్వంత ఫుట్‌బాల్ నైపుణ్యాలను ప్రదర్శించాడు. ఇంట్లో ఓ చైర్‌ను గోల్ పోస్ట్‌గా పెట్టి బంతిని అందులోకి పంపిస్తాడు. తనలానే చేయాలని అభిమానులకు ఓ ఛాలెంజ్ విసిరాడు.
'నేను నా ఫుట్‌బాల్ నైపుణ్యాలను ప్రదర్శించాను. ఇక ఇప్పుడు మీ వంతు. లాలిగా హోమ్ గోల్ ఛాలెంజ్‌లో పాల్గొనండి. నాలానే మీరు కూడా చేసి.. ఆ వీడియోను మీ ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్‌లలో పోస్ట్ చేయండి. ఆ వీడియోకి @LaLiga @RohitSharma45 మరియు #HitmanAtHomeని ట్యాగ్ చేయండి. ఛాలెంజ్‌లోని మొదటి ఐదు మంది విజేతలు నాతో లైవ్ వీడియోలో మాట్లాడొచ్చు. హర్రీ అప్ గైస్' అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా ఛాలెంజ్‌లో పాల్గొనండి.
'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ 2019లో భారతదేశంలో లాలిగా మొట్టమొదటి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. లీగ్ చరిత్రలో లాలిగా అంబాసిడర్‌గా ఎంపికయిన మొదటి ఫుట్‌బాల్ యేతర ఆటగాడు రోహిత్ కావడం విశేషం. రోహిత్ శర్మకు క్రికెట్ ఆటతో పాటుగా ఫుట్‌బాల్ కూడా చాలా ఇష్టం. 2020 మార్చిలో రోహిత్ ప్రసిద్ధ ఫుట్‌బాల్ పోటీ అయిన ఎల్ క్లాసికోను చూడటానికి మాడ్రిడ్ వెళ్లిన విషయం తెలిసిందే. కుటుంబంతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచులను ఎంజాయ్ చేశాడు.
Also Read: Weather forecast: ఈసారి ఎండలు మండిపోవడం ఖాయం- రికార్టు స్థాయిలో ఉష్టోగ్రతలు!
Also Read: Electricity bill: వేసవిలో కరెంటు బిల్లు తగ్గాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook