ITR E Verify 2020-21: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేవారికి ఇది అత్యంత కీలకమైన అప్‌డేట్. మీరు దాఖలు చేసిన ఐటీఆర్‌ను ఈ వెరిఫై చేసుకోవడం తప్పనిసరి. ఇవాళే ఆఖరు తేదీ. మీ ఐటీఆర్ ఈ వెరిఫై ఎలా చేయాలంటే..
ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడమే కాదు ఈ వెరిఫై కూడా అందులో ఓ కీలకమైన భాగం. అందుకే ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి ఈ విషయమై కీలకమైన అలర్ట్ వస్తోంది. ఒకవేళ మీరు ఇన్‌కంటాక్స్ దాఖలు చేసి..ఇంకా ఈ వెరిఫై చేయకపోతే వెంటనే పూర్తి చేయండి. దీనికి ఆఖరు తేదీ ఫిబ్రవరి 28. రిటర్న్స్ దాఖలు చేసిన 120 రోజుల్లోగా ఈ వెరిఫై చేసుకోవల్సి ఉంటుంది. లేకపోతే డిఫెక్టివ్ రిటర్న్‌గా పరిగణిస్తారు. అలాగని ఇదేమీ క్లిష్టమైన ప్రక్రియ కానే కాదు. అత్యంత సులభంగా ఇంట్లోనే కూర్చుని..ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు.
ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్, బ్యాంక్ ఎక్కౌంట్, డీమ్యాట్ ఎక్కౌంట్ ద్వారా ఈ వెరిఫై చేసుకోవచ్చు. ఈ వెరిఫై లేకపోతే..రిటర్న్స్ దాఖలు చేసినా చెల్లదని గుర్తుంచుకోవాలి. ఐటీఆర్‌కు సంబంధించిన 5 పేజీలపై సంతకం చేసి బెంగళూరు సీపీసీకు పంపించడం ద్వారా కూడా ఐటీఆర్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవచ్చు. ఈ ఫైలింగ్ చేసేటప్పుడు ఈ వెరిఫికేషన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అందులో అడిగిన వివరాలను నమోదు చేసి..మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. అప్పుడు మాత్రమే మీ ఈ వెరిఫికేషన్ పూర్తవుతుంది.
నెట్ బ్యాంకింగ్ ద్వారా వెరిఫై చేసుకునేందుకు ముందుగా మీ బ్యాంకు ఖాతాకు లాగిన్ కావాలి. ఇందులో ట్యాక్స్ ట్యాబ్ ఆప్షన్‌లో ఈ వెరిఫికేషన్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. అక్కడ్నించి మీరు ఇన్‌కంటాక్స్ ఈ ఫైలింగ్ వెబ్‌సైట్‌కు టర్న్ అవుతారు. అందులో మై ఎక్కౌంట్ ఆప్షన్ తీసుకుని..ఈవీసీ క్లిక్ చేయాలి. పది అంకెల న్యూమెరిక్ కోడ్ ..మీ మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్‌కు వస్తుంది. ఈ కోడ్ మూడ్రోజులపాటు చెల్లుతుంది. మై ఎక్కౌంట్ ట్యాబ్‌లో ఈ వెరిఫికేషన్ ఎంచుకున్న తరువాత...మొబైల్‌కు వచ్చిన ఓటీపీ చేస్తే..ఈ వెరిఫికేషన్ పూర్తయినట్టే.
డీమ్యాట్ ఖాతా ద్వారా ఈ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఈ ఫైలింగ్ ఎక్కౌంట్‌లో వెళ్లి..అక్కడి నుంచి ప్రొఫైల్ సెట్టింగ్స్‌లో వెళ్లాలి. మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ, డిపాజిటర్ పేరు వంటి వివరాల్ని ఎంటర్ చేయాలి. రిజిస్టర్ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ, డీమ్యాట్ ఎక్కౌంట్‌లో నమోదై ఉండటం తప్పనిసరి. వివరాల్ని ధృవీకరించిన తరువాతే.. వెరిఫికేషన్ పూర్తవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook