Sri Lanka have won the toss and have opted to field: సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లు క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. శ్రీలంకతో టీ20 పోరుకు సిద్ధమైంది. లక్నో వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ మరికాసేపట్లో ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన లంక కెప్టెన్ దాసున్ శనక ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో భారత్ ముందుగా బ్యాటింగ్‌కు దిగనుంది. ఇది చాలా మంచి పిచ్ అని, గత కొన్ని మ్యాచులలో బాగా బౌలింగ్ చేయడం మాకు కలిసొస్తుంది అని లంక కెప్టెన్ చెప్పాడు.
ఈ మ్యాచ్ కోసం జట్టులో ఆరు మార్పులు చేసినట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. గాయం కారణంగా రుతురాజ్ గైక్వాడ్ ఈరోజు ఆడడం లేదన్నాడు. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, దీపక్ చహర్, సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్ ఆడడం లేదు. రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, సంజూ శాంసన్, దీపక్ హుడా రీఎంట్రీ ఇచ్చారు. స్టార్ ఆటగాళ్లు దూరమయినా భారత్ ఇప్పటికీ పటిష్టంగానే ఉంది. మరోవైపు లంకలో స్టార్ ప్లేయర్స్ ఉన్నారు.
ఇటీవల సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డే, మూడు టీ20 సిరీస్‌లు రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. మంచి ఫామ్‌లో ఉన్న టీమిండియాను ఆపడం లంకకు కాస్త కష్టమనే చెప్పాలి. భారత్, శ్రీలంక మధ్య మొత్తం 22 టీ20 మ్యాచ్‌లు జరగ్గా.. అందులో టీమిండియా 14 విజయాలు సాధించింది. మరో 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
Let's play! @Paytm #INDvSL pic.twitter.com/ywYFhA4Slk
— BCCI (@BCCI) February 24, 2022
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (కీపర్), శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, వెంకటేష్ అయ్యర్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చహల్.
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, చరిత్ అసలంక, దినేష్ చండిమాల్ (కీపర్), జనిత్ లియానాగే, దసున్ షనక (కెప్టెన్), చమిక కరుణరత్నే, జెఫ్రీ వాండర్సే, ప్రవీణ్ జయవిక్రమ, దుష్మంత చమీర, లహిరు కుమార.
Also Read: Redmi Smart LED TV X43 Offer: 14 వేల బంపరాఫర్.. అతితక్కువ ధరకే రెడ్‌మీ 43 అంగుళాల స్మార్ట్ టీవీ!!
Also Read: Malaika Arora Trolls: అయ్యోరామ.. మలైకా అరోరా ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook