Smart Phones: రూ.15 వేల లోపు బెస్ట్ కెమెరా ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ ఫోన్స్ ఇవే..

Best 64MP Camera Smart Phones Under Rs.15000: రూ.15వేల లోపు 64 ఎంపీ కెమెరా ఫీచర్లతో ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2022, 06:00 PM IST
  • రూ.15 వేల లోపు 64 మెగా పిక్సెల్స్‌తో కూడిన స్మార్ట్ ఫోన్లు
  • రూ.15 వేల లోపు ఆయా బ్రాండ్స్‌లో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు
  • పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి
Smart Phones: రూ.15 వేల లోపు బెస్ట్ కెమెరా ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ ఫోన్స్ ఇవే..

Best 64MP Camera Smart Phones Under Rs.15000: ఒకప్పుడు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కోసం సోనీ, నికాన్, కెనాన్ వంటి కెమెరాలనే ఎక్కువగా ఉపయోగించేవారు. ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కొత్త పుంతలు తొక్కిందనే చెప్పాలి. ఇందుకోసం చాలామంది మంచి కెమెరా ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లను ఎంచుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్ అంటేనే మంచి కెమెరా ఫీచర్స్ ఉన్నాయా లేదా చూసి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.15వేల లోపు ధరలో 64 మెగా పిక్సెల్స్‌ ఫీచర్‌తో అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్ల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. 

Samsung Galaxy M32

ప్రస్తుతం Samsung Galaxy M32 స్మార్ట్‌ ఫోన్‌ కేవలం రూ.13,699కే అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 64MP బ్యాక్ కెమెరా సెటప్, 20MP ఫ్రంట్ కెమెరా  ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Helio G80 ప్రాసెసర్‌తో అమర్చబడింది. 6000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

Moto G40 ఫ్యూజన్

ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 13,999.6000 mAh బ్యాటరీ సామర్థ్యంతో పాటు 64MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.

రియల్‌ మీ 7

రియల్‌ మీ 7 ప్రస్తుతం రూ. 14,999 ధరలో అందుబాటులో ఉంది. ఇందులో 64 మెగా పిక్సెల్స్‌తో కూడిన బ్యాక్ కెమెరా, 16MPతో కూడిన ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో MediaTek Helio G95 ప్రాసెసర్‌ ఉంది.

టెక్నో కామన్ 17

Tecno Camon 17 ధర ప్రస్తుతం రూ. 14,999గా ఉంది. దీని బ్యాక్ కెమెరా 64MP సెటప్‌తో, ఫ్రంట్ కెమెరా 16MP సెటప్‌తో ఉంది. ఇందులో MediaTek Helio G85 ప్రాసెసర్‌ అమర్చబడి ఉంది. 

Also Read: RJ Rachana: పాపులర్ రేడియో జాకీ రచన హఠాన్మరణం.. పునీత్ లాగే చిన్న వయసులో గుండెపోటుతో మృతి

Also Read: Bandla Ganesh Audio Leak: త్రివిక్రమ్ నన్ను రావొద్దంటున్నాడు.. 'భీమ్లా నాయక్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై బండ్ల గణేష్ సంచలన కామెంట్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News