President Ram Nath Kovind: విశాఖకు రాష్ట్రపతి....స్వాగతం పలికిన సీఎం జగన్‌..

President Ram Nath Kovind: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు. ఆయనకు సీఎం జగన్ స్వాగతం పలికారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2022, 09:19 PM IST
  • విశాఖకు రాష్ట్రపతి కోవింద్
  • స్వాగతం పలికిన సీఎం, గవర్నర్
  • రేపు ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూలో పాల్గొననున్న రాష్ట్రపతి
President Ram Nath Kovind: విశాఖకు రాష్ట్రపతి....స్వాగతం పలికిన సీఎం జగన్‌..

President Ram Nath Kovind: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు గవర్నర్ బిశ్వభూషణ్, ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) ఘన స్వాగతం పలికారు. వీరి వెంట సభాపతి తమ్మినేని సీతారాం, రాష్ట్ర మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు. సోమవారం జరిగే ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూలో (President Fleet Review) పాల్గొనడానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విశాఖకు (Visakhapatnam) వచ్చారు. 

ఐఎన్‌ఎస్‌ డేగాలో రాష్ట్రపతికి (President Ram Nath Kovind) స్వాగతం పలికిన తరువాత సీఎం జగన్‌ తిరుగు పయనంకానున్నారు. అనంతరం రాష్ట్రపతి ఐఎన్‌ఎస్‌ డేగా నుంచి తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో ఏర్పాటు చేసిన బస ప్రాంతానికి వెళ్తారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు జరిగే  ఫ్లీట్‌ రివ్యూలో ప్రెసిడెంట్ రామ్‌నాథ్‌ కోవింద్‌ పాల్గొంటారు. ఆయన మూడు రోజులపాటు ఇక్కడే ఉండనున్నారు. 

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను (Aazadi Ka Amrit Mahotsav) పురస్కరించుకుని..ఫిబ్రవరి 21న బంగాళాఖాతంలో రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ-22ను నిర్వహించనున్నారు. ‘ఇండియన్ నేవీ– 75 ఇయర్స్ ఇన్ సర్వీస్’ అనేది థీమ్. రాష్ట్రపతి సాయుధ దళాల సుప్రీం కమాండర్‌గా తన ఐదేళ్ల కాలంలో ఒకసారి భారత నౌకాదళాన్ని సమీక్షిస్తారు. 2016లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విశాఖపట్నంలో సిటీ ఆఫ్ డెస్టినీగా పిలవబడే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూను పరిశీలించారు. PFR-22లో భాగంగా.. కోవింద్ 10,000 మంది సిబ్బందితో కూడిన 60 నౌకలు, 50 ఎయిర్‌క్రాఫ్ట్‌లు  పాల్గొననున్నాయి. 

Also Read: Pawan Kalyan Rally: ర్యాలీలో అపశ్రుతి.. జనసేనాని పవన్ కల్యాణ్ కు తప్పిన ప్రమాదం! Video

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News