Actor Sonu Sood saves 19 year old Young man in Car Accident: కరోనా వైరస్ మహమ్మారి వచ్చినప్పటి నుంచి 'రియల్ హీరో' సోనూ సూద్ ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత రెండేళ్ల కాలంగా వైరస్ బాధితులకు అండగా నిలుస్తున్నారు. మొదటి దశలో తిండి లేక ఇబ్బందిపడిన వలస కార్మికులను ఆదుకున్నారు. రెండో దశలో కరోనా బారిన పడిన వారికి ఆక్సిజన్ సిలిండర్లు, మందులను అందించారు. అంతేకాదు ఆన్లైన్ చదువుల కోసం ఇబ్బందులు పడుతున్న పేద విద్యార్థులకు మొబైల్స్, టాబ్స్ సమకూర్చాడు. దాంతో సోనూ ఒక్కసారిగా రియల్ హీరో అయ్యారు.
తాజాగా సోనూ సూద్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. అర్థరాత్రి రోడ్డుపై ప్రమాదంలో ఓ యువకుడి ప్రాణాలను కాపాడారు. విషయంలోకి వెళితే... పంజాబ్‌లోని మోగా నగరంలోని కొట్కాపురా బైపాస్ సమీపంలో సోమవారం అర్థరాత్రి దాటాక రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ 19 ఏళ్ల యువకుడు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. రెండు కార్లు వేగంగా ఢీ కొట్టుకోవడంతో యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. డ్రైవింగ్ సీటుపైనే గాయాలతో పడిపోయాడు.
ప్రమాదంలో కారులో చిక్కుకున్న గాయపడిన యువకుడిని సోనూ సూద్ గమనించారు. వెంటనే తన కారును ఆపి తన టీమ్ సభ్యులతో కలిసి గాయపడిన వ్యక్తిని కారులోంచి బయటకు తీసే ప్రయత్నం చేశాడు. కారులో సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉన్నందున బాధితుడిని కారులో నుంచి బయటకు తీయడానికి కొంత సమయం పట్టింది. సోనూ చాలా కారు లోపలికి వెళ్లి కస్టపడి మరీ ఆ యువకుడిని బయటకు తీశాడు. అతడికి గాయాలు అవ్వడంతో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.
Accident of 2 vehicles occured in Moga. Sonu Sood himself took out the unconscious boy from the car and took him to the hospital in his car. #sonusood pic.twitter.com/BM7fjvighU
— Gagandeep Singh (@Gagan4344) February 8, 2022
సరైన సమయంలో తగిన చికిత్స అందడంతో గాయపడిన 19 ఏళ్ల యువకుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం అతడికి మెరుగైన వైద్యం అందుతోంది. సోనూ సూద్ సదరు యువకుడిని కాపాడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 'సూపర్ హీరో' అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అక్షయ్ కుమార్ తాజా సినిమా పృథ్వీరాజ్లో సోనూ సూద్ నటిస్తున్నారు. ప్రముఖ రియాలిటీ షో రోడీస్‌లో రణ్విజయ్ సింఘా స్థానంలో హోస్ట్‌గా కూడా చేయనున్నారు.
Also Reaad: Viral Photo: పుష్ప రాజ్‌గా టీమిండియా స్టార్ ప్లేయర్స్.. ఎవరు బాగా సెట్ అయ్యారంటే?
Also Read: Liger Prime Video: భారీ మొత్తానికి అమ్ముడైన 'లైగర్' నాన్ థియేట్రికల్ రైట్స్.. పుష్ప కంటే డబుల్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook