Warner Likely to be Named as RCB Captain: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఒక్కసారి కూడా టైటిల్ కొట్టని విషయం తెలిసిందే. 2008 నుంచి ఆడుతున్నా టైటిల్ అందని ద్రాక్ష లాగే మిగిలిపోయింది. ప్రతిసారి 'ఈసాలా కప్ నమ్‌దే' అంటూ రావడం, ఉత్తి చేతులతో ఇంటికి వెళ్లడం ఆ జట్టుకు అలవాటుగా మారింది. ఎందుకోమరి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నా.. ఆర్సీబీ మాత్రం కప్ కొట్టలేకపోతోంది. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఎంత కష్టపడినా.. టైటిల్ నెగ్గలేక చివరకు ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. విరాట్ ఇప్పుడు ఆ జట్టులోనే ఉన్నా.. ఆర్సీబీ వేరే సారథిని నియమించుకోవాల్సి వచ్చింది.
ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్ 2022 మెగావేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా ఎవర్ని నియమించనున్నారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, సురేశ్ రైనా, శ్రేయస్ అయ్యర్, క్వింటన్ డికాక్, ఇయాన్ మోర్గాన్ పేర్లు ఆర్సీబీ సారథి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో వార్నర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అతడికే ఆర్సీబీ కెప్టెన్సీని అప్పజెప్పే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ కీలక ఆటగాడు. టోర్నీ టాప్ స్కోరర్ల జాబితాలో ఐదో స్థానంలో (5449 ) కొనసాగుతున్నాడు. కెప్టెన్‌గానూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను విజయవంతంగా నడిపించాడు. 2016లోసన్‌రైజర్స్‌కు టైటిల్ అందించాడు. ఆపై నాలుగేళ్లు వరుసగా ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. అయితే గతేడాది ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన అతడిని జట్టు యాజమాన్యం పక్కనపెట్టింది. ముందుగా తుది జట్టు నుంచి తప్పించి.. తర్వాత కెప్టెన్‌గానూ తొలగించింది. దీంతో వార్నర్ వేలంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆర్సీబీ కెప్టెన్‌గా వార్నర్ పేరే ప్రధానంగా వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఆర్సీబీ తలరాత మారనుందేమో చూడాలి.
శ్రేయస్ అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును రెండేళ్లు సమర్ధవంతగా నడిపించాడు. 2020లో ఏకంగా ఫైనల్‌కు చేర్చాడు. అయితే అనూహ్యంగా మనోడిని ఢిల్లీ వదిలేసుకుంది. ఆర్సీబీకి వార్నర్ తర్వాత మంచి కెప్టెన్‌గా శ్రేయస్ కనిపిస్తున్నాడు. వైస్ కెప్టెన్‌గానూ చెన్నై ఎంతోకాలం పనిచేసిన సురేష్ రైనా కూడా రేసులో ఉన్నాడు. ఆస్ట్రేలియాను అద్భుతంగా నడిపించిన స్టీవ్ స్మిత్, ఇంగ్లండ్ జట్టుకు ప్రపంచకప్ అందించిన ఇయాన్ మోర్గాన్, దక్షిణాఫ్రికా తరఫున కెప్టెన్సీ అనుభవం ఉన్న క్వింటన్ డికాక్ కూడా కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఆర్సీబీ ఎవరికి ఓటేస్తుందో చూడాలి.
Also Read: Video: అచ్చు అల్లు అర్జున్‌ని దింపేసిందిగా.. ఆమె డ్యాన్స్‌కి నెటిజన్లు ఫిదా...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook