MK Stalin writes a letter to 37 leaders: తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ 37 మంది కీలక రాజకీయ పార్టీల నేతలకు లేఖ రాశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు మరో 36 మంది నేతలకు ఆయన లెటర్ రాశారు. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఫర్ సోషల్ జస్టిస్‌లో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తూ ఎంకే స్టాలిన్ ఈ లేఖ రాశారు. సామాజిక న్యాయాన్ని అలాగే సమనత్వాన్ని విశ్వసించే వాళ్లంతా ఒక్క తాటిపైకి రావాలని తాను ఆకాంక్షిస్తున్నాని స్టాలిన్ పేర్కొన్నారు.
ప్రత్యేకమైనటువంటి.. వైవిధ్యభరితమైనటువంటి బహు సాంస్కృతిక సమాఖ్య నేడు మతోన్మాదంతో పాటు మత ఆధిపత్యం ముప్పులో చిక్కుకుంది అని స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు. ఆత్మాభిమానంతో పాటు సమానత్వం సామాజిక న్యాయంపై విశ్వాసం ఉన్న వాళ్లంతా ఒక్కతాటిపైకి వచ్చి ఏకమైతేనే ఈ శక్తుల్ని అడ్డుకోగలమంటూ స్టాలిన్ (MK Stalin) రాసుకొచ్చారు.
ఈ లక్ష్యాల్ని సాధించేందుకుగాను కలిసి కట్టుగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో మండల్ కమిషన్‌ను ఏర్పాటు చేయడానికి మనం చేసిన కృషిని గుర్తు చేసుకుందామన్నారు. అదే స్ఫూర్తితోనే మనమందరం ఏకం కావాలంటూ స్టాలిన్ పిలుపునిచ్చారు.
Tamil Nadu CM & DMK President MK Stalin writes a letter to 37 leaders of 'key political parties' inviting them to participate in All India Federation for Social Justice
"Let's come together as a true Union of States with conviction, to ensure 'Everything for Everyone'," he says pic.twitter.com/AK45skXsH3
— ANI (@ANI) February 2, 2022
ఇక ఇటీవల రిపబ్లిక్ డే (Republic Day) సందర్భంగా స్టాలిన్ "ఆల్ ఇండియా ఫెడరేషన్ ఫర్ సోషల్ జస్టిస్" ప్రారంభించనున్నట్లు తెలిపారు. అంతేకాదు దీనికి అన్ని రాష్ట్రాల్లో అణగారిన వర్గాల వారే ప్రాతినిధ్యం వహిస్తారంటూ స్టాలిన్ చెప్పుకొచ్చారు. ఆ మేరకు ఇప్పుడు స్టాలిన్ 37 మంది కీలక రాజకీయ పార్టీల (Political Parties) నేతలకు లేఖ రాశారు. వారందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు స్టాలిన్ (Stalin) ప్రయత్నిస్తున్నారు.
Also Read: Etela Rajender: కేసీఆర్ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని కోరుకుంటున్నాడు.. అలా మాట్లాడటం సిగ్గుచేటు
Also Read: Revanth Reddy Strategy: కేసీఆర్, ఒవైసికి బీజేపి సుపారీ.. ఇదిగో నిదర్శనం: రేవంత్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook