SBI withdraws pregnant women temporary unfit guidelines: గర్భిణి మహిళలు ఉద్యోగంలో చేరేందుకు సంబంధించి ఎస్‌బీఐ జారీ చేసిన మార్గదర్శకాలు వివాదాస్పదం కావడంతో ఆ సంస్థ వెనక్కి తగ్గక తప్పలేదు. తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలను ఉపసంహరించుకుంటున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. ఇదివరకు అమలులో ఉన్న మార్గదర్శకాలనే ఇకముందు కూడా కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది. ప్రజాభీష్టం మేరకు వారి మనోభావాలను గౌరవిస్తూ సవరించిన మార్గదర్శకాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.
అంతకుముందు, గర్భిణీ మహిళలను ఉద్యోగంలో చేర్చుకునేందుకు సంబంధించిన నిబంధనల్లో ఎస్‌బీఐ చేసిన సవరణలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. మూడు నెలల గర్భంతో ఉన్న మహిళలను 'టెంపరరీ అన్‌ఫిట్'గా అందులో పేర్కొన్నారు. బిడ్డకు జన్మనిచ్చిన 4 నెలల తర్వాతే వారు ఉద్యోగంలో చేరాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని ప్రకటించారు. అయితే ఎస్‌బీఐ తీసుకొచ్చిన ఈ నిబంధనలు ముమ్మాటికీ మహిళలపై వివక్ష చూపించడమేనన్న విమర్శలు వెల్లువెత్తాయి.
ఎస్‌బీఐ తాజా నిబంధనలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15,16లకు విరుద్ధమని పేర్కొంటూ మధురై ఎంపీ వెంకటేశన్ ఆ సంస్థ ఛైర్మన్‌కు లేఖ రాశారు. ఇది పితృస్వామిక భావజాలానికి అద్దం పట్టేలా ఉందని.. ఇలాంటి ధోరణి సరికాదని అన్నారు. వెంటనే సవరించిన నిబంధనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అటు ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతి మాలివల్ సైతం ఈ నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌బీఐకి (State Bank of India) నోటీసులు జారీ చేసిన స్వాతి మాలివల్.. వెంటనే ఆ నిబంధనలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఎస్‌బీఐ తమ నిర్ణయంపై వెనక్కి తగ్గక తప్పలేదు.
However, in view of the public sentiments, SBI has decided to keep the revised instructions regarding recruitment of pregnant women candidates in abeyance and continue with the existing instructions in the matter, the State Bank of India added in the statement
— ANI (@ANI) January 29, 2022
Also Read: Monkey love video: తల్లి ప్రేమ అంటే అంతే మరి.. మనుషులలైనా.. జంతువులైన!
Also Read: Budget 2022: మోదీ సర్కార్ రాకతో బడ్జెట్ సాంప్రదాయాల్లో వచ్చిన మార్పులివే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook