January 28 Horoscope: ఈ రాశి వారు.. వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి!

January 28 Horoscope, Rasi Phalalu: రాశిఫలాలు జనవరి 28, 2022. రాహుకాలం - ఉదయం 11:05 - మధ్యాహ్నం 12:29. యమగండం - సాయంత్రం 3:17  - సాయంత్రం 4:41 వరకు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2022, 06:54 AM IST
  • జనవరి 28 2022 నాటి రాశిఫలాలు
  • ఆ రాశి వారికి ఇవాళ ఆర్థికంగా అన్నీ శుభఫలితాలే
  • మరో రాశి వారు సమయానుసారంగా స్పందిస్తే అంతా మేలే జరగనుంది..
January 28 Horoscope: ఈ రాశి వారు.. వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి!

January 28 Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం, తిథి: బహుళపక్షం ఏకాదశి - జనవరి 28 ఉదయం 02:16 ‌‌- జనవరి 28 రాత్రి 11:36. బహుళపక్షం ద్వాదశి - జనవరి 28 రాత్రి 11:36 - జనవరి 29 రాత్రి 08:37. అమృతకాలము - రాత్రి 09:04 - రాత్రి 10:32 వరకు. బ్రహ్మ ముహూర్తం - ఉదయం 05:16 - ఉదయం 06:04 వరకు. జనవరి 28, 2022 శుక్రవారం నాటి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి.

మేషం: (Aries)
ఈ రాశి వారికి పట్టుదల ఎక్కువ. అదే వారిని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఈ రోజు బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. శివుడి ఆరాధన మంచిది.

వృషభం: (Taurus)
కొన్ని ఆటంకాల ఏర్పుడుతాయి. దీంతో మీ శ్రమ అధికం కావొచ్చు. అయితే మీ అభివృద్ధికి సంబంధించిన విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మీరు మీ బంధువులతో అలాగే మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీకు నవగ్రహ ఆలయ దర్శనం చాలా శుభప్రదమైనది.

మిథునం: (Gemini)
ఈ రాశివారు మనోబలం తగ్గకుండా చూసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇవాళ కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం ఉంటుంది. కొన్ని సంఘటనలు మీకు వ్యతిరేకంగా జరుగుతాయి. లింగాష్టకం చదివితే చాలా మంచింది.

కర్కాటకం: (Cancer)
ఈ రాశి వారికి తోటివారి సహకారం చాలా ఉంటుంది. ఇవాళ మీ ప్రతిభను కొందరు ప్రశంసిస్తారు. మీకు ఈ రోజు శరీరసౌఖ్యం కలుగుతుంది. అలాగే బంధుమిత్రులతో ఎంతో ఆనందంగా గడుపుతారు. మీరు ఈ రోజు ఆంజనేయుడి స్తోత్రం చదివితే శుభప్రదం.

సింహం : (Leo)
ఈ రాశి వారు సకాలంలో పనులు పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని పనులు మొదలుపెట్టండి... అన్ని సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇక ఈ రోజు మీరు దుర్గాదేవిని పూజిస్తే చాలా మంచిది.

కన్య: (Virgo)
ఈ రోజు ఈ రాశి వారు ఆశించిన ఫలితాల్ని పొందుతారు. అలాగే ఉద్యోగం చేసే చోట కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. మీరు మీకు ఇష్టమైన వారితోనే ఈ రోజు కాలక్షేపం చేస్తారు. అలాగే ముఖ్యమైన సందర్భాల్లో మొహమాటాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దరిచేరనీయకండి. మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకోండి.

తుల: (Libra) 
మీరు ప్రారంభించిన పనుల్ని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీకు బంధువుల, మిత్రుల సహాయ సహకారాలన్నీ పుష్కలంగా ఉంటాయి. మీరు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని మంచి విజయాలు సాధిస్తారు. అయితే పడని వారితో మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వేంకటేశ్వరస్వామి దర్శనం చాలా మంచిది.

వృశ్చికం : (Scorpio)
మీరు ప్రారంభించిన పనులన్నింటినీ ఉత్సాహంతో పూర్తి చేసి విజయం సాధిస్తారు. అలాగే ఆర్థికంగా కూడా శుభఫలితాలే ఉంటాయి. విందూవినోదాల్లోనూ పాల్గొంటారు. ఆత్మీయులతో ఎంతో ఆనందంగా గడుపుతారు. మీ ఇష్టదైవాన్ని పూజించండి.

ధనుస్సు: (Sagittarius) 
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఈరోజు మంచి ఫలితాలు ఈ రాశి వారికి ఉంటాయి. అయితే కొన్ని కీలక విషయాల్లో మాత్రం మీరు సమయానుసారంగా స్పందిస్తే అంతా మేలే జరుగుతుంది. ఆర్థికంగా కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు రావు. ఇష్టదైవాన్ని దర్శించుకోండి.

మకరం: (Capricorn) 
మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురు అవుతాయి. అయినా కూడా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం కాస్త తడబడే అవకాశం ఉంటుంది. ఈ రోజు జరిగే కొన్నిపరిస్థితులు మీకు చాలా బాధ కలిగిస్తాయి. శని శ్లోకం చదివితే చాలా మంచిది.

Also Read: Todays Gold Rate: పసిడి ప్రియులకు శుభవార్త, దేశంలో ఇవాళ్టి బంగారం ధరలు

కుంభం: (Aquarius) 
మీకు ఈ రోజు చాలా మంచి రోజు. మీరు బంధువులు, మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మీకు ధనలాభం కూడా ఉంది. మీ పై అధికారుల సహకారం ఫుల్‌గా ఉంటుంది. అయితే తప్పుదోవ పట్టించేవారు కూడా ఉంటారు. జాగ్రత్తగా వ్యవహరించండి.

మీనం: (Pisces
మీరు చిత్తశుద్ధితో పనులను పూర్తి చేస్తారు. అయితే మీకు రోజు కాస్త మానసిక ప్రశాంతత అవసరం ఉంటుంది. ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకండి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ఉదయమే సూర్యుడిని ఆరాధిస్తే అంతా మంచే జరుగుతుంది.

Also Read: Todays Gold Rate: పసిడి ప్రియులకు శుభవార్త, దేశంలో ఇవాళ్టి బంగారం ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News