Virat Kohli - Vamika: సూపర్ స్పోర్ట్స్.. ఇది పద్దతికాదు! కోహ్లీ-అనుష్క కోరినా కూడా అలానేనా చేసేది!!

Virat Kohli daughter Vamika Face. దక్షిణాఫ్రికా బ్రాడ్‌కాస్టర్ సూపర్ స్పోర్ట్స్ విరాట్ కోహ్లీ కూతురు వామిక ముఖాన్ని స్పష్టంగా చూపించడంతో అభిమానులు మండిపడుతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2022, 07:46 AM IST
  • వామిక మీడియాలో వైరల్
  • సూపర్ స్పోర్ట్స్.. ఇది పద్దతికాదు
  • కోహ్లీ-అనుష్క కోరినా కూడా అలానేనా చేసేది
Virat Kohli - Vamika: సూపర్ స్పోర్ట్స్.. ఇది పద్దతికాదు! కోహ్లీ-అనుష్క కోరినా కూడా అలానేనా చేసేది!!

Indian Fans Slams SA Broadcaster SuperSports: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli), బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ (Anushka Sharma)కు గతేడాది జనవరి (2021 జనవరి 11)లో కూతురు 'వామిక' పుట్టిన విషయం తెలిసిందే. వామిక (Vamika) పుట్టి ఏడాది దాటినా ఇప్పటిదాకా తన ఫొటోలు, వీడియోలు ఏవీ విరుష్క సోషల్ మీడియాలో పంచుకోలేదు. తమ కూతురు విషయంలో ఎంతో జాగ్రత్తపడ్డారు. తమ కూతురి ఫొటోలు, వీడియోలు తీయొద్దని కోహ్లీ-అనుష్క ఇద్దరు మీడియాను కోరిన సంగతి తెలిసిందే. 

అయితే ఆదివారం దక్షిణాఫ్రికాతో భారత్‌ చివరి వన్డే (IND vs SA 3rd ODI) సందర్భంగా విరాట్ కోహ్లీ కూతురు వామిక (Vamika Face) లైవ్‌లో దర్శనమిచ్చింది. స్టాండ్స్‌లో అనుష్క శర్మ చేతుల్లో ఉండగా.. కెమెరా కంటికి చిక్కింది. మూడో వన్డేలో కోహ్లీ అర్ధ శతకం సాధించినపుడు వామికకు అతణ్ని చూపిస్తూ అనుష్క చప్పట్లు కొట్టడం వీడియోలో కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also Read: Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి పసిడి ధరలు..

దక్షిణాఫ్రికా బ్రాడ్‌కాస్టర్ సూపర్ స్పోర్ట్స్ (SuperSports) వామిక ముఖాన్ని స్పష్టంగా చూపించింది. దాంతో అభిమానులు దక్షిణాఫ్రికా బ్రాడ్‌కాస్టర్‌ (Broadcaster)పై మండిపడుతున్నారు. 'సూపర్ స్పోర్ట్స్.. ఇది పద్దతికాదు' అని ఒకరు కామెంట్ చేయగా.. 'విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ కోరినా కూడా అలానేనా చేసేది' అని ఇంకొకరు ట్వీటారు. 'బ్రాడ్‌కాస్టర్.. గోప్యతను గౌరవించాలి', 'సూపర్‌స్పోర్ట్.. వామిక ముఖాన్ని చూపించడం చాలా తప్పు', 'వారి గోప్యతను గౌరవించకుండా ఇలా చేయడం చాలా నేరం' అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

Also Read: Lockdown: రాష్ట్రంలో పంజా విసురుతున్న కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ దిశగా ఆలోచన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News