AP govt. restores covid command control center: ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర స్థాయి కొవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను తక్షణమే పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ అధ్యక్షతన పలువురు ఐఏఎస్ అధికారుల బృందంతో దీన్ని ఏర్పాటు చేశారు.
కరోనా నిబంధనల అమలు చేయడం, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగులకు నాణ్యమైన వైద్యం అందించడం, 104 కాల్ సెంటర్ నిర్వహణ, ఆక్సిజన్ సరఫరా, హోం ఐసోలేషన్ కిట్లు, ఫీవర్ సర్వే, అత్యవసర మందుల సరఫరా తదితర అంశాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ అధికారులు పర్యవేక్షిస్తారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కొవిడ్ వైద్య సేవలు, ల్యాబ్ మేనేజ్‌మెంట్, మొబైల్ మెడికల్ యూనిట్లు, అంబులెన్సుల పర్యవేక్షణను కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ పర్యవేక్షించనుంది. గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో పాజిటివ్ కేసులు పెరగకుండా రోజూ కలెక్టర్లతో సమన్వయం చేసుకుని సమర్ధవంతమైన చర్యలు తీసుకోనుంది.
Also Read: AP CS pressmeet on PRC : కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గవు.. ఏపీ సీఎస్ సమీర్ శర్మ వెల్లడి
రాష్ట్రంలో బుధవారం రోజువారీ కేసుల సంఖ్య పదివేల మార్క్‌ను దాటేసింది. రాష్ట్రంలో కొత్తగా 10,057 మంది (10,057 fresh covid-19 cases) కరోనా బారిన పడ్డారు. ఇక కరోనా వల్ల నిన్న విశాఖపట్నంలో (Visakhapatnam) ముగ్గురు మరణించారు. నెల్లూరు, శ్రీకాకుళం, చిత్తూరు, విజయనగరం, గుంటూరు జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పొయారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook