Todays Gold Rate: బంగారం ధరలు గత కొద్దిరోజులుగా స్వల్పంగా పెరుగుతుండగా..ఇవాళ కాస్త బ్రేక్ పడింది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
బులియన్ మార్కెట్లో బంగారం ధరల పెరుగుదలకు చాలా కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, కరోనా థర్డ్‌వేవ్, ఒమిక్రాన్ వేరియంట్, డాలర్ విలువ వంటివి ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే బంగారం ఎప్పటికప్పుడు మారుతుంటుంది. ఇవాళ దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు ఎలా ఉందో పరిశీలిద్దాం.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం (Gold Rate)10 గ్రాముల ధర 47 వేల 140 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 51 వేల 430 రూపాయలుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 90 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 90 రూపాయలుగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 340 రూపాయలైతే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 440 రూపాయలుంది. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 3 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల 50 వేలుగా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 990 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 90 రూపాయలుగా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 990 రూపాయలైతే..24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 90 రూపాయలుంది.
ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం (Hyderabad Gold Rate) 10 గ్రాముల ధర 44 వేల 990 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 90 రూపాయలుంది. ఇక విశాఖపట్నం, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 990 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 90 రూపాయలుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook