Murder case: నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన మొండెం లేని తల కేసులో పురోగతి లభించింది. ఆ వ్యక్తికి సంబంధించిన మొండెం భాగాన్ని పోలీసులు రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ వద్ద గుర్తించారు.
ముందు దొరికిన తల ఆధారంగా హత్యకు గురైన ఆ వ్యక్తి సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం శూన్య పహాడ్ తండాకు చెందిన రమావత్ జయేందర్ నాయక్(30)గా గుర్తించిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు కూడా ఈ ఆ వ్యక్తిని గుర్తించారు. సోషల్ మీడియా ద్వారా ఆ వ్యక్తి ఫోటోను షేర్ చేసి వివరాల తెలుసుకోవడం గమనార్హం.
తాజాగా తుర్కయంజాల్‌లో.. నూతనంగా నిర్మిస్తున్న ఓ అపార్ట్మెంట్లో మొండెం బయటపడపడింది. గత కొంత కాలంగా ఆ వ్యక్తి ఆ ప్రాంతంలోనే నివాసముంటున్నట్లు కూడా తెలిసింది.
మొండెం భాగానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన తర్వాత ఈ విషయంపై అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు నల్గొండ పోలీసులు.
కేసు వివరాలు ఇలా..
నల్లగొండ జిల్లా, చింతపల్లి మండలం మెట్టు మహంకాళి మాత పాదాల వద్ద మూడు రోజుల క్రితం ఓ మొండెం లేని తల లభ్యమైంది. గుప్త నిధులకోసం ఎవరైనా ఇలా చేశారా? కారణాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఈ కేసు ఛేధించేందుకు 8 టీమ్‌లు దర్యాప్తు సాగిస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా మొండెం భాగాన్ని గుర్తించారు. ఇక ఈ దారుణానికి పాల్పడింది ఎవరనే విషయంపై విచారణ సాగుతోంది.
ఇటీవలే నల్గొండ ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న రేమా రాజేశ్వరి ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. ఇందులో భాగంగా కేసులో ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారామె.
Also read: జడ్చర్లలో కంటైనర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఒకరి మృతి, ఏడుగురికి గాయాలు..
Also read: TS RTC bus points : సంక్రాంతి స్పెషల్ బస్సులు నిలిచే పాయింట్స్ ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook