Omicron Wave: వచ్చే నెలలో భారత్‌లో కరోనా పీక్స్‌కి.. డెల్టా పీక్‌ని మించి...

Omicron Wave in India: కరోనా వ్యాక్సినేషన్‌తో వైరస్ నుంచి పొంచి ఉండే ముప్పు తగ్గుతుందని డా.క్రిస్టఫర్ ముర్రే పేర్కొన్నారు. భారత్‌లో ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ జరిగినందునా... డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ కేసులతో ఆసుపత్రిపాలవడం లేదా మరణం సంభవించే ముప్పు తక్కువగా ఉంటుందన్నారు

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2022, 10:00 AM IST
  • వచ్చే నెలలో దేశంలో కరోనా పీక్స్‌కి
  • ఒమిక్రాన్ వేవ్‌గా చెబుతున్న నిపుణులు
  • రోజుకు 5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం
 Omicron Wave: వచ్చే నెలలో భారత్‌లో కరోనా పీక్స్‌కి.. డెల్టా పీక్‌ని మించి...

Omicron Wave in India: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు దేశాలు కోవిడ్ థర్డ్ వేవ్‌తో (Covid 19 Third Wave) విలవిల్లాడుతున్నాయి. యూరోప్, ఆఫ్రికా దేశాల్లో గతేడాదే థర్డ్ వేవ్ మొదలైంది. ప్రస్తుతం భారత్ కూడా థర్డ్ వేవ్‌లోకి ప్రవేశించిందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇటీవలి కాలంలో అకస్మాత్తుగా పెరిగిన కరోనా కేసులే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం వరకు 10 వేల మార్క్‌కి కాస్త అటు, ఇటుగా నమోదైన కేసులు ఇప్పుడు ఏకంగా లక్ష మార్క్‌ని చేరడం 'థర్డ్ వేవ్' తీవ్రతను తెలియజేస్తోంది.

ఫిబ్రవరి నాటికల్లా దేశంలో కరోనా వ్యాప్తి మరోసారి పీక్స్‌కి (Covid 19 Peak in India) చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే రోజుకు 5లక్షల చొప్పున కేసులు నమోదవొచ్చునని చెబుతున్నారు. గతేడాది ఏప్రిల్‌లో డెల్టా వ్యాప్తి పీక్స్‌కి చేరినప్పటి కంటే... రాబోయే ఫిబ్రవరిలో భారత్‌లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అమెరికాలోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ డైరెక్టర్ డా.క్రిస్టఫర్ ముర్రే అభిప్రాయపడ్డారు. 

'భారత్ ఇప్పుడు ఒమిక్రాన్ వేవ్‌లోకి (Omicron Wave in India) ప్రవేశిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఒమిక్రాన్ వేవ్‌ని ఎదుర్కొంటున్నాయి. గతేడాది డెల్టా వేవ్ కంటే ఈసారి ఒమిక్రాన్ వేవ్‌తో కేసుల సంఖ్య మరింత పెరుగుతుంది. అయితే డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రత అంతగా ఉండదు.' అని డా.క్రిస్టఫర్ వెల్లడించారు. భారత్‌లో కరోనా తీవ్రతపై కొన్ని నమూనాలు రూపొందించామని... త్వరలోనే వాటిని విడుదల చేస్తామని చెప్పారు.

కరోనా వ్యాక్సినేషన్‌తో వైరస్ నుంచి పొంచి ఉండే ముప్పు తగ్గుతుందని డా.క్రిస్టఫర్ ముర్రే పేర్కొన్నారు. భారత్‌లో ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ జరిగినందునా... డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ కేసులతో (Omicron Cases in India) ఆసుపత్రిపాలవడం లేదా మరణం సంభవించే ముప్పు తక్కువగా ఉంటుందన్నారు. దాదాపు 85.2 శాతం కేసుల్లో అసలు లక్షణాలే కనబడవని అన్నారు. కొద్ది కేసులు మాత్రమే ఆసుపత్రి వరకు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ కారణంగా మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండదని పేర్కొన్నారు. అయితే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా... అంతే వేగంగా అదే మ్యుటేషన్ చెందుతుందని... తద్వారా కొత్త వేరియంట్ పుట్టుకొచ్చే అవకాశం ఉంటుందని అన్నారు.

Also Read: Corona cases in India: దేశంలో కొవిడ్ కల్లోలం- కొత్తగా 1,41,986 కేసులు నమోదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News