IND vs SA: మూడో టెస్ట్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. గాయంతో స్టార్ పేసర్ ఔట్!!

టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ గాయం కారణంగా మూడో టెస్ట్‌కు దూరం కానున్నట్లు సమాచారం తెలుస్తోంది. రెండో టెస్ట్‌లో గాయపడిన సిరాజ్‌ ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2022, 02:58 PM IST
  • మూడో టెస్ట్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ
  • గాయంతో స్టార్ పేసర్ ఔట్?
  • కోహ్లీ మూడో టెస్ట్‌లో ఆడుతాడు?
IND vs SA: మూడో టెస్ట్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. గాయంతో స్టార్ పేసర్ ఔట్!!

Mohammed Siraj likely to miss Cape Town Test: మూడు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా జోహన్నెస్‌బర్గ్ వేదికగా గురువారం దక్షిణాఫ్రికా (South Africa)తో ముగిసిన రెండో టెస్టులో భారత్ (India) ఓడిపోయిన విషయం తెలిసిందే. రెండో టెస్ట్‌ ఓటమి నుంచి కోలుకునే లోపే భారత్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. టీమిండియా స్టార్‌ పేసర్‌, హైదరాబాద్ గల్లీ భాయ్ మహ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj) గాయం కారణంగా మూడో టెస్ట్‌కు దూరం కానున్నట్లు సమాచారం తెలుస్తోంది. రెండో టెస్ట్‌లో గాయపడిన సిరాజ్‌ ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది.

రెండో టెస్ట్‌ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన టీమిండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid).. మొహ్మద్ సిరాజ్ గాయం (Mohammed Siraj Injury)పై స్పందించారు. 'మొహ్మద్ సిరాజ్‌తో నెట్స్‌లో చాలా కష్టపడాలి. హామ్ స్ట్రింగ్ గాయం నుంచి వెంటనే కోలుకోవడం ఎవరికైనా చాలా కష్టం. మొదటి ఇన్నింగ్స్‌లో గాయంతో సిరాజ్‌ దూరం కావడం మాకు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. సిరాజ్ గాయపడినప్పటికీ.. మూడో రోజు బౌలింగ్‌కు వచ్చాడు. అందుకు అతడిని మెచ్చుకునే తీరాలి. ఒక వేళ కెప్‌ టౌన్‌లో జరిగే మూడో టెస్ట్‌కు సిరాజ్‌ దూరమైతే.. ఉమేష్ యాదవ్ (Umesh Yadav), ఇషాంత్ శర్మ (Ishant Sharma)లలో ఒకరు ఆడుతారు' అని ద్రవిడ్ చెప్పారు. 

Also Read: Alia Bhatt Pictures: రణబీర్ కపూర్ ఫోటోగ్రఫీ.. అద్భుతంగా ఉన్న ఆలియా భట్!!

విరాట్‌ కోహ్లీ గాయం (Virat Kohli Injury)పై టీమిండియా కోచ్‌ (Team India Coach) రాహుల్‌ ద్రవిడ్‌ స్పందిస్తూ... 'ప్రస్తుతం విరాట్ కోహ్లీ వెన్ను నొప్పి నుంచి కోలుకున్నాడు. త్వరలో కేప్ టౌన్‌లో నెట్ సెషన్‌లో పాల్గొంటాడు. అతడి గాయంపై ఎప్పటికప్పుడు వైద్యులతో చర్చిస్తున్నాను. కోహ్లీ మూడో టెస్ట్‌లో ఆడుతాడని నేను ఆశిస్తున్నాను' అని పేర్కొన్నారు. ఈ పర్యటనలో టీమిండియాను గాయాల బెడద వెంటాడుతుంది. ఇప్పటికే గాయం కారణంగా రోహిత్‌ శర్మ మొత్తం పర్యటనకు దూరం కాగా.. విరాట్‌ కోహ్లీ వెన్ను నొప్పి కారణంగా రెండో టెస్ట్‌ నుంచి తప్పుకున్నాడు. ఇక మొహ్మద్ సిరాజ్ కూడా మూడో టెస్ట్ ఆడుతాడో లేదో తెలియదు. 

Also Read: Ben Stokes: స్టోక్స్ కాక.. అదృష్టం అంటే నీదే పో! బంతి స్టంప్‌కు తాకినా బతికిపోయావుగా (వీడియో)!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News