IND Vs SA 2nd Test: జోహన్నెస్‌బర్గ్ వేదికగా టీమ్ఇండియాతో జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా ఘనవిజయం సాధించింది. 240 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ 96 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తెంబా బవుమా(23) అతడికి సహకారం అందించాడు. ఇండియా బౌలర్లలో షమీ, ఠాకూర్, అశ్విన్ తలో వికెట్ తీశారు.
దక్షిణాఫ్రికా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సారథి ఎల్గర్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌటైంది. బదులుగా సౌతాఫ్రికా 229 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 266 పరుగులు చేసిన టీమ్ ఇండియా.. దక్షిణాఫ్రికా ముందు 240 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
సిరీస్ సమం
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి. చివరిదైన మూడో టెస్టు కేప్ టౌన్ వేదికగా జనవరి 11 నుంచి జరగనుంది.
గాయం కారణంగా ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టుకు దూరమయ్యాడు. వెన్నునొప్పి కారణంగా మ్యాచ్ కు దూరమైనట్లు జట్టు మేనేజ్ మెంట్ తెలిపింది.
అయితే జనవరి 11న కేప్ టౌన్ లో జరగనున్న ఆఖరి టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అది కోహ్లీ కెరీర్ లో 100వ టెస్టు మ్యాచ్. ఆ మ్యాచ్ లో కచ్చితంగా వింటేజ్ కోహ్లీని చూస్తారంటూ అటు ఇండియన్ ఆటగాళ్లతో పాటు ఇటు కోహ్లీ ఫ్యాన్స్ కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Ashes 2022: ఓరి నీ అభిమానం పాడుగాను.. అక్కడ ఆటోగ్రాఫ్ తీసుకుంటే ఎలారా సామీ (వీడియో)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి