కేంద్ర కేబినెట్ నుంచి తమ పార్టీ తప్పుకుంటున్నట్టు తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. బుధవారం రాత్రి ఏపీ రాజధాని అమరావతి నుంచి మీడియాతో మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కేంద్ర కేబినెట్లో మంత్రులుగా కొనసాగుతున్న ఇద్దరు టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు గురువారం తమ పదవులకి రాజీనామా చేస్తారని చంద్రబాబు తేల్చిచెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసమే తాము కేంద్ర కేబినెట్లో చేరాం. అయితే, కేంద్ర ప్రభుత్వం నుంచి మేము ఏదైతే కోరుకున్నామో.. అది నెరవేరనప్పుడు ఇంకా కేంద్ర కేబినెట్లో కొనసాగడంలో అర్థం లేదనిపించింది అని ఆవేదన వ్యక్తంచేశారు చంద్రబాబు నాయుడు. కేవలం రాష్ట్రం శ్రేయస్సు కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు చంద్రబాబు వివరించారు.