Complaint on Minister Srinivas Goud : మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో ప్రాణహాని.. హెచ్ఆర్సీలో టీఆర్‌‌ఎస్‌ నేత ఫిర్యాదు!

TRS leader files complaint against on Minister Srinivas Goud : తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హెచ్ఆర్సీలో కంప్లైంట్. తనకు ప్రాణహాని ఉందంటూ మహబూబ్ నగర్‌ టీఆర్ఎస్‌ కౌన్సిలర్ ఫిర్యాదు చేసిన బూర్జు సుధాకర్ రెడ్డి. పోలీసులతో కుమ్మక్కై వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన బాధితుడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 4, 2022, 04:22 PM IST
  • మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హెచ్ఆర్సీలో కంప్లైంట్
  • మహబూబ్ నగర్‌ టీఆర్ఎస్‌ కౌన్సిలర్ బూర్జు సుధాకర్ రెడ్డి హెచ్ఆర్సీలో ఫిర్యాదు
  • ప్రాణ హాని ఉంది.. రక్షణ కల్పించాలంటూ విజ్ఞప్తి
Complaint on Minister Srinivas Goud : మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో ప్రాణహాని.. హెచ్ఆర్సీలో టీఆర్‌‌ఎస్‌ నేత ఫిర్యాదు!

TRS leader Burju Sudhakar Reddy files complaint in HRC against on Telangana Minister Srinivas Goud : మహబూబ్ నగర్‌‌లో ఒక టీఆర్‌‌ఎస్ పార్టీ నేత... టీఆర్‌‌ఎస్ మంత్రిపై ఫిర్యాదు చేశారు. మంత్రి వల్ల తనకు ప్రాణహాని ఉందని, తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ.. పోలీసుల ద్వారా తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఒక టీఆర్ఎస్‌ నేత పేర్కొన్నారు. 

తెలంగాణ ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ (Minister Srinivas Goud) వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ టీఆర్‌‌ఎస్ నేత ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేశారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై (Mahabubnagar MLA) పట్టణంలోని రాంనగర్ 43వ వార్డ్‌ టీఆర్ఎస్‌ కౌన్సిలర్ బూర్జు సుధాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. 

మహబూబ్ నగర్‌‌లో (Mahabubnagar) నిర్మిస్తోన్న అక్రమ కట్టడాలపై మంత్రి కేటీఆర్, అధికారులకు ఫిర్యాదు చేశాననే ఉద్దేశంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ తనపై కక్ష పెంచుకున్నారని సుధాకర్ రెడ్డి (Sudhakar Reddy) పేర్కొన్నారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌.. పోలీసులతో (Police) కుమ్మక్కై తనను వేధిస్తున్నారంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తనని హత్య (Murder) చేయించాలని చూస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు ప్రాణ రక్షణ కల్పించాలంటూ టీఆర్ఎస్‌ కౌన్సిలర్ బూర్జు సుధాకర్ రెడ్డి కోరారు. 

Also Read : Delhi Weekend Curfew: దేశ రాజధానిలో కరోనా ఉద్ధృతి.. ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రోద్బలంతోనే పోలీసులు తనపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై (Minister Srinivas) వెంటనే చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీని కోరారు. అలాగే తనకు రక్షణ కల్పించాలంటూ, శ్రీనివాస్ గౌడ్‌పై చర్యలు తీసుకోవాలంటూ మంత్రి కేటీఆర్‌‌కు (KTR‌) సుధాకర్ రెడ్డి విన్నవించుకున్నారు.

Also Read : Corona Third Wave: ఇండియాలో కరోనా థర్డ్‌వేవ్‌కు కారణం ఆ నగరాలేనా..??

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News