Today's Horoscope: 4-1-2022 మంగళవారం.. ఆ రాశి వారు కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటి!!

కన్య రాశి వారికి ఇవాళ అసలు బాగోలేదు. కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 4, 2022, 07:37 AM IST
  • 4-1-2022 మంగళవారం రాశి ఫలాలు
  • ఆ రాశి వారు కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటి
  • ఆ విషయంలో కుంభ రాశివారికి కలిసిరానుంది
 Today's Horoscope: 4-1-2022 మంగళవారం.. ఆ రాశి వారు కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటి!!

Astrological prediction for January 04, 2022: మేషం: అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. పందేలు, జూదాలకు దూరంగా ఉండాలి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతల ఉంటాయి. ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తులతో తక్కువగా మాట్లాడండి. దైవ సేవాకార్య క్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఎటువంటి స్వార్థ చింతన లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.

వృషభం: విద్యార్థులకు విద్యా విషయాల పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. ఇంటిపనులను వాయిదా వేయటం మంచిది. అపకీర్తి వచ్చే అవకాశముంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండటం మంచిది. స్త్రీలు పని ఒత్తిడి, ఊహించని చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. ఇతరుల సలహా తీసుకోవాలి.

మిథునం: ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్తగా ఉండాలి. పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి కలిసివచ్చే కాలం. ఆహార విషయంలో పరిమితులు పాటించటం మంచిది. ఒక విషయంలో సొంతవారితో విభేదిస్తారు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్యబాధలుంటాయి. 

కర్కాటకం: అకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కీలకమైన విషయాలు మీ జీవితభాగస్వామికి తెలియజేయటం మంచింది. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండకూడదు. చెడు పనులకు దూరంగా ఉండాలి. కోపాన్ని తగ్గించుకోవడం శ్రేయస్కరం. కొత్తపనులు ప్రారంభించరాదు.  ప్రతి విషయంలోను జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇతరుల సలహాలు ఓసారి ఆలోచించాలి.

Also Read: Netizens trolling on Anchor Anasuya : బయటపడ్డ అనసూయ అసలు రూపం.. అమ్మ బాబోయ్‌, వామ్మో!

సింహం: ప్రయాణాల లక్ష్యం నెరవేరకపోవటంతో నిరుత్సాహానికి గురవుతారు. నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధన లాభంతో రుణబాధలు తొలగిపోతాయి. కుటుంబంతో కలిసి గడుపుతారు. శత్రుబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. రాజకీయనాయకులకు కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. 

కన్య: ఈ రాశివారికి ఇవాళ అసలు బాగోలేదు. కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు ఉన్నాయి. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులెదురవుతాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. కొందరి (పసుపు, మిర్చి, నూనె, కంది, రసాయన, సుగంధ ద్రవ్య) వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. కొంతమంది మీ యత్నాలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. 

తుల: తోటి వారితో విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించాలి. వ్యాపార పరంగా ధననష్టం కలిగే అవకాశాలున్నాయి. విద్యార్థినుల నిర్లక్ష్యం, ఏకాగ్రత లోపం వల్ల ఒత్తిడి, మందలింపులు అధికమవుతాయి. బ్యాంకు పనుల్లో అలసత్వం వల్ల ఇబ్బందు లెదుర్కుంటారు. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి తప్పవు. ఆత్మీయుల కలయిక ఉత్సాహం కలిగిస్తుంది. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం.

వృశ్చికం: రాజకీయ నాయకులు సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. వైద్యులకు చాలా ఏకాగ్రత అవసరం. ప్రింటింగ్ రంగాల వారికి చికాకులు తప్పవు. స్త్రీలు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి చూపుతారు. ఆకస్మిక ధననష్టం పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం.

ధనస్సు: వ్యాపార ధననష్టం కలిగే అవకాశాలున్నాయి. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. సినిమా, కళా రంగాల్లో వారికి కాస్త కలిసిరానుంది. విద్యార్థులు రాణిస్తారు. రుణయత్నం వాయిదా పడుతుంది. ప్రయత్నలోపం లేకున్నా పనులు పూర్తిచేసుకోలేక పోతారు.

Also Read: Priyanka Gandhi to isolate : ఐసోలేషన్‌లో ప్రియాంక గాంధీ.. వారికి కోవిడ్ పాజిటివ్ అట!

మకరం: శుభకార్య ప్రయత్నాలు నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరాణాలను ఖరీదు చేస్తారు. వ్యాపారాల అభివృద్ధికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. స్త్రీలకు విలాస వస్తువులు, అలంకరణల పట్ల మక్కువ పెరుగుతుంది. ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. ముఖ్యమైన కార్యాలు పూర్తి అవుతాయి.

కుంభం: ప్రేమికులకు కలిసివస్తుంది. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో పాల్గొంటారు. దంపతుల మధ్య అవగాహన లోపం, కలహాలు చోటుచేసుకుంటాయి. కార్యసాధనలో చిన్న చిన్న ఆటంకాలెదురైనా ధైర్యంగా ఎదుర్కుంటారు. మానసికానందాన్ని పొందుతారు. ప్రతివిషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంది.

మీనం: తల పెట్టిన పనులు ముందుకు వెళ్లవు. చిన్న చిన్న విషయాలలో ఉద్రేకపడటం మంచిది కాదు. కోర్టు వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. సోదరులతో వైరమేర్పడకుండా మెలగాలి. నూతన వ్యక్తులజోలికి వెళ్లరాదు. స్త్రీలకు పనివారలతో చికాకులు, శ్రమాధిక్యత తప్పవు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News