Gang War: హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్లో దారుణం చోటు చేసుకుంది. శనివారం రాత్రి మందుబాబులు వీరంగం (Drunk riot) సృష్టించారు. రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
ఎల్బీ నగర్‌లోని కేకే గార్డెన్ వెనుక ఖాళీ ప్రదేశంలో మందుబాబులు వీరంగం సృష్టించారు. ఆ ప్రాంతంలో మద్యం తాగుతున్న కొందరితో మరో గ్యాంగ్ గొడవకు (Gang war in Hyderabad) దిగారు. అక్కడ మద్యం సేవించొద్దని గొడవ పెట్టుకున్నారు.
ఇరు వర్గాల మధ్య మాటా మాట పెరిగి.. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. రాళ్లు, కర్రలతో ఒకరినొకరు కొట్టుకున్నారు.
ఈ దాడుల్లో నర్సింహారెడ్డి అనే యువకుడికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మరికొంత మందికి గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. దీనితో మిగతా మందుబాబులంతా పరారయ్యారు. ఆ ఖాళీ ప్రదేశంలో మద్యం సేవించొద్దనడమే గొడవకు దారి తీసిందా? లేదా ఇరు వర్గాల మధ్య ముందే ఏదైనా గొడవ ఉందా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నర్సింహా రెడ్డి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పారారీలో ఉన్న వారిని గాలిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. కొత్త సంవత్సరం (New Year 2022) రోజు ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో స్థానిక ప్రజలు ఒక్క సారిగా ఉలిక్కిపడ్డారు.
Also read: Hyderabad: మిఠాయి పాడైందని నెటిజన్ ట్వీట్...జీహెచ్ఎంసీ రియాక్షన్.. కరాచీ బేకరీకి రూ.10వేల జరిమానా!
Also read: Nampally Exhibition 2022: గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభమైన నాంపల్లి ఎగ్జిబిషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook