India Omicron Update: కరోనా మహమ్మారి సంక్రమణ మళ్లీ ఊపందుకుంది. దేశంలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ సంక్రమణ వేగం పుంజుకుంది.
దేశంలో కరోనా సంక్రమణ వేగం పుంజుకుంది. భారీగా కేసులు పెరుగుతున్నాయి. మొన్నటి వరకూ తగ్గిన కరోనా సంక్రమణ ఇప్పుడు ఒక్కసారిగా పెరిగింది. దేశంలోని కరోనా కేసుల పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో దేశంలో 22 వేల 775 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా 4 వేల 781 కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు 98.32 కాగా, గత 24 గంటల్లో 406 మంది మరణించారు. దేశవ్యాప్తంగా 8 వేల 949 మంది కరోనా కోలుకున్నారు. ఇక మరోవైపు ఒమిక్రాన్ (Omicron Variant)సంక్రమణ వేగం పుంజుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 1431 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 454 కేసులు, ఢిల్లీలో 351, తమిళనాడులో 118, గుజరాత్ రాష్ట్రంలో 115, కేరళో 109, రాజస్థాన్‌లో 69, తెలంగాణలో 62 కేసులు నమోదయ్యాయి. మొన్నటి వరకూ రోజుకు 6 నుంచి 8 వేల కేసులు మాత్రమే నమదవుతూ ఉండేది. ఇప్పుడా పరిస్థితి మారింది. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది.
Also read: Born on Same Day: ఆ ఊర్లో జనవరి 1వ తేదీన 80 శాతం మంది పుట్టారంట.. అదెక్కడో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి