IT returns: ట్యాక్స్ పేయర్స్‌కు కీలక ప్రకటన ప్రకటన చేసింది కేంద్రం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇన్‌కం ట్యాక్స్ రిటర్ను (ఐటీఆర్) దాఖలు చేసేందుకు గడువు పెంపు ఉండదని స్పష్టం చేసింది. గడువు పెంపునకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ వెల్లడించారు. 2021-22 మదింపు సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ దాఖలు గడువు నేటితో ముగియనున్నట్లు స్పష్టం చేశారు.
నిజానికి ఐటీఆర్ దాఖలుకు గడువు జులై 31తో ముగియాల్సి ఉంది. కరోనా భయాలు, ఐటీఆర్ వెబ్సైట్లలో లోపాల కారణంగా గడువు పెంచుతూ వచ్చింది కేంద్రం. అలా డిసెంబర్ 31 ని తుది గడువుగా నిర్ణయించింది. ప్రస్తుతం ఈ ప్రక్రియ సాఫిగా సాగుతున్న నేపథ్యంలో గడువు పెంపు యోచన లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
పెరిగిన ఐటీఆర్ ఫైలింగ్స్..
ఈ ఏడాది ఇప్పటి వరకు (డిసెంబర్ 31 మధ్యాహ్నం 3 గంటల వరకు)5.62 కోట్ల మంది ఐటీఆర్ దాఖలు చేసినట్లు తరుణ్ బజాజ్ వెల్లడించారు. గతంతో పోలిస్తే 60 లక్షల రిటర్నులు అధికంగా దాఖలైనట్లు వివరించారు. ఇక చివరి రోజు 20 లక్షలకు పైగా ట్యాక్స్ పేయర్స్ ఐటీఆర్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు.
రేపటి నుంచి ఐటీఆర్ దాఖలుకు చేసేందుకు రూ.5,000 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం ఇది వరకే స్పష్టం చేసింది.
Also read: Petrol Pump Frauds: దేశంలోని అనేక పెట్రోల్ స్టేషన్లలో చీటింగ్.. ఆ మోసాలను పసిగట్టండిలా!
Also read: Stock Market today: 2021కి భారీ లాభాలతో గుడ్‌బై చెప్పిన స్టాక్ మార్కెట్లు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook